Charmy Kaur: సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం.. చాలా బాధగా ఉంది: చార్మి

Charmy Kaur: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మొదటి షో తోనే డిజాస్టర్ కైవసం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా చూసిన అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాపై విమర్శలు చేశారు. సినిమాలో కంటెంట్ లేకపోయినా సినిమాలకు అతిగా ప్రమోషన్ చేసి ఇలాంటి రిజల్ట్ ఎదుర్కొన్నారంటూ పలువురు ఈ సినిమా విషయంపై స్పందిస్తూ విమర్శలు చేశారు. ఇక ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్, పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది..

ఈ క్రమంలోనే ఈ సినిమా డిజాస్టర్ విషయంపై చార్మి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ..జనాలు ఇంట్లో కూర్చుని ఒక క్లిక్ తో ఎంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాని కుటుంబం మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఇంటిల్లిపాది ఇంట్లో కూర్చుని చూస్తున్నారు. అయితే సినిమా ఎగ్జైట్ చేయనంతవరకు వాళ్ళు థియేటర్లకు రారని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం..

తెలుగులో ఇప్పటికే విడుదలైన సీతారామం, బింబిసారా, కార్తికేయ 2వంటి సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు లేవు 2019 నుంచి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం..కరోనా సమయంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ సినిమాని థియేటర్లో విడుదల చేసాం అయితే ఈ సినిమా ఇలాంటి రిజల్ట్ అందుకోవడం చాలా బాధగా ఉందని ఈ సందర్భంగా ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -