Chatrapathi Hindi Movie: ఆ కారణం వల్లే హిందీలో ఛత్రపతి మూవీ డిజాస్టర్ అయిందా?

Chatrapathi Hindi Movie: 18 ఏళ్ల క్రితం 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ప్రభాస్‌ను స్టార్ హీరోను చేసింది. ప్రస్తుతం మనదేశంలో హీరోలని మించిన స్టార్ అయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలతో హిందీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ‘ఛత్రపతి’ రీమేక్‌ను ఎంచుకున్నారు. కానీ ఈ మూవీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. అయితే దీని వెనక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

ఛత్రపతి సినిమా ఏకంగా రెండు దశాబ్దాల క్రితంది. అప్పటి ఆడియన్స్ వేరు ఇప్పటి ఆడియన్స్ వేరనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న సినారియోకి అనుగుణంగా మూవీ కథ ఉండటం ఆనవాయితీ. కానీ పాత కథలకి కొత్త ముఖాలు చూపిస్తే ఎంత వరకు విజయం సాధిస్తాయనేది చెప్పలేం. కానీ సాహసోపేతంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమా చేశారు.

అయితే ఈ సినిమా చేయటానికి చాలా సమయాన్నే తీసుకున్నారు. కానీ ఒరిజినల్ ను చెడగొట్టకూడదనే ఉద్దేశమో లేక మళ్లీ రీ-వర్క్ ఎందుకనే నిర్లక్ష్యమో తెలీదు కానీ.. ఉన్నదున్నట్టు రీమేక్ చేశారు. దీంతో ఈతరం బాలీవుడ్ ఆడియన్స్ కు ఛత్రపతి అస్సలు నచ్చలేదు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అస్సలు ఆకట్టుకోలేదు. కథలో బలమైన అంశాలనే
ఈ రీమేక్ లో చెడకొట్టారు.

 

నిజంగా చెప్పాలంటే రీమేక్ చేసేటప్పుడు కథలో ఆత్మను పట్టుకోవడం చాలా ముఖ్యం.ఛత్రపతి రీమేక్ లో ఆ ప్రయత్నం ఏ కోసానా కూడా కనిపించదు. ఒరిజినల్ ను చెడగొట్టామనే కామెంట్స్ వస్తాయనే భయంతో సన్నివేశాలను మార్చకుండా తీసేశారు. అయితే ఇప్పటి తరానికి ఎక్స్ పోజింగ్ కావాలనే ఉద్దేశంతో భలేగా కెమెరా యాంగిల్స్ సెట్ చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ పూర్తిగా ఫెయిలూర్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -