AP Volunteers: చెప్పేదొకటి చేసేదొకటి.. వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం చేయించడం న్యాయమేనా జగన్?

AP Volunteers: ఏపీలో మరికొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి వాలంటీర్లను మాత్రం ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ఎలాంటి పనులలో కూడా వారిని వినియోగించుకోకూడదు అంటూ ఎలక్షన్ కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే.

కలెక్టర్ల ఆదేశాల ప్రకారం ప్రస్తుతం వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వారెవరు కూడా ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగాను ఎన్నికల విధులలోకి హాజరు కాకూడదు కానీ ఇలాంటి ఆదేశాలు మాకు ఏవి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు వాలంటీర్లు. తాజాగా వాలంటీర్లు ప్రతి ఇంటి ఇంటికి వెళ్తూ వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.

తాజాగా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతాలలో వాలంటీర్లు చూసే కుటుంబాల వాట్స్అప్ గ్రూపులలో మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ పేరిట ఒక నెంబర్ ఉంటుంది. ఈ వాట్సాప్ లో ఆరోజు వారు ఎక్కడెక్కడ పర్యటించారనే విషయాల గురించి అప్డేట్ ఇవ్వడమే కాకుండా కొన్ని యూట్యూబ్ లింక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రూపులలో కూడా ఈ నెంబర్ ఉంటుంది.

ఇలా గత ఐదు సంవత్సరాల కాలంలో తాము చేస్తున్నటువంటి పనులను అలాగే ప్రస్తుత ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వాలంటీర్ల ద్వారా ఈ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ప్రతి ఒక్క ఇంటికి ఈ సమాచారం వెళ్లేలా చేస్తున్నారు. ఇక ఈ విషయంపై పలువురు స్పందిస్తూ ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను కూడా బీభత్సంగా ఉపయోగిస్తున్నారని ఇలా వీరిని ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఉపయోగించడం ఎంతవరకు సమంజసం జగన్ రెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -