Cloves: ఉదయం లవంగాలు తింటే వచ్చే ప్రయోజనాలివే!

Cloves: ప్రతి వంటింట్లో లవంగాలు కచ్చితంగా పెట్టుకుంటారు. లవంగాలు లేకుండా ఏ వంటకం కూడా చేయరు. ఎండబెట్టి పూల మొగ్గల నుంచి తయారయ్యే ఈ లవంగం వంటకాలకు గుమగుమలాడే సువాసనలను వెదజల్లుతోంది. కూరలు, బేకరీల్లో, సూపులు, మాంసం, ఎన్నెన్నో వంటకాల్లో లవంగాలనే వాడుతారు. లవంగాలు వంటలకే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇదే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి నివారణిగా, జీర్ణ, శ్వాసకోశ సమస్యలను సైతం దూరం చేస్తుంది. ఇంకా ఈ లవంగాలను ఖాళీ కడుపుతో తీసుకోవడంతో అద్భుతమైన ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

లవంగం కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హెపటైటిస్‌ సమస్యను తగ్గిస్తుంది. కొత్త కణాల పెరుగుదల, కాలేయ నిర్విషీకరణ ప్రోత్సహిస్తుంది. ఇందులోని జైమోల్, యూజినాల్‌ వంటి క్రియాశీల సమ్మేళనాల కారణంగా రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో చిటికెడు లవంగాల పొడిని తీసుకోవడం వలన డయాబెటిక్‌ పేషెంట్ల బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. బీటా సెల్‌ పనితీరును ప్రోత్సహిస్తుంది. ఉదయం సిక్‌నెస్‌తో బాధపడేవారు లవంగాలను ఖాళీ కడుపుతో నమలడంతో చాలా ప్రయోజనం ఉంటుంది. వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు నోటి దుర్వాసనకు చెక్‌ పెడుతోంది.వాటితో పాటు పంటి నొప్పులుంటే వాటిని సైతం నివారిస్తోంది.

నోటి, చిగురువాపు, నోటి దుర్వాసన నివారణకు అద్భుతంగా పని చేస్తోంది. లవంగాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మనం తినే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణ రసాల స్రావాన్ని ప్రోత్సహించి, కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్‌ పెడుతుంది. అంతేకాక కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది లవంగాలలో మాంగనీస్, ప్లేవనాయిడ్స్‌ వంటి మూలకాలు ఉండటంతో ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -