Chiranjeevi-Balayya: చిరు, బాలయ్య కాన్ఫిడెన్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

Chiranjeevi-Balayya: 2020 తర్వాత కరోనా వల్ల సినిమా థియేటర్లు కళ తప్పాయని చెప్పొచ్చు. గత రెండేళ్ల నుంచీ సంక్రాతి పండగకు భారీ చిత్రాలేవీ విడుదల కాలేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి భారీ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా థర్డ్ వేవ్ ప్రభావంతో ఆ సినిమాలు ఆ టైంలో విడుదల కాలేకపోయాయి.

 

తాజాగా 2023 సంక్రాంతికి మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పొచ్చు. ప్రతిసారి లాగే రెండు భారీ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. సంక్రాంతికి ఇలా రెండు పెద్ద సినిమాలు రిలీజైనా వాటితో పాటు ఒకట్రెండు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు వస్తూ ఉండటం మామూలుగానే ఉంటుంది.

 

చిరు, బాలయ్యల సినిమాలకున్న హైప్ చూస్తుంటే వాటి ముందు ఏ సినిమాలు నిలవవని అనిపిస్తోంది. మిగతా మూడు సినిమాల్లో బజ్ తక్కువగా ఉంది. తమిళ సినిమా ‘తెగింపు’తో హీరో అజిత్ బరిలో ఉన్నారు. ఈ సినిమాకు తెలుగులో అసలు ప్రమోషన్ అంతగా కనిపించలేదు. ఇకపోతే ఆ సినిమాకు 11వ తేదిన సోలో రిలీజ్ ఛాన్స్ దక్కగా ఆ ఒక్క రోజు ఓ మోస్తరుగా వసూళ్లను అది రాబట్టుకునే అవకాశం ఉంది. కానీ తర్వాతి రోజు నుంచి ఆ సినిమాకు థియేటర్లు ఉండవని తెలుస్తోంది.

 

12, 13వ తేదీల్లో చిరు, బాలయ్యల సినిమాలు విడుదల కానున్నాయి. ఆ రెండు రోజుల వాటికి ఎక్కువ థియేటర్లను ఇవ్వనున్నారు. ఈ రెండు సినిమాల ట్రైలర్లూ మాస్‌కు విందు భోజనంలా అనిపిస్తూ భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇవి థియేటర్లలోకి దిగాక వేరే సినిమా వైపు ప్రేక్షకులు చూడరని అనిపిస్తోంది. రెండు సినిమాలకు మించి పండక్కి డబ్బులు పెట్టడానికి కూడా జనాలు అంతగా ఇష్టపడరు కాబట్టి చిరు, బాలయ్య సినిమాలు చూడ్డం పక్కాగా ఉంది. ఇవి అందుబాటులో ఉండగా మరో తమిళ సినిమా ‘వారసుడు’ కూడా విడుదల కానుంది. ఆ తర్వాత చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’ కూడా రిలీజ్ అవ్వనుంది. వీటిని చిరు, బాలయ్యల సినిమాలు తొక్కుకుంటూ వెళ్లిపోవడం గ్యారెంటీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -