Chiranjeevi Balayya: ఒకే వేదికపై చిరంజీవి బాలకృష్ణ.. ఆ మార్పుకు కారణమిదేనా?

Chiranjeevi Balayya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఒక హీరో నటించిన సినిమాకు మరొక హీరో సహాయం చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడాలు లేకుండా హీరోలందరూ కూడా ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా విడుదల అవుతుంది అంటే తప్పకుండా ఆ సినిమాకి స్టార్ హీరోల సపోర్ట్ లభిస్తుందని చెప్పాలి.

ఇక చిన్న హీరోల సినిమాలకు కూడా ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ వంటి వాళ్ళు హాజరవుతూ సినిమాలను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాల హవా కూడా పెరిగిపోయింది. ఇలా హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడంతో అభిమానులకు కన్నుల పండుగగా ఉందని చెప్పాలి. ఇలా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 

వీరిద్దరూ కలిసి సినిమా చేయకపోయినా కనీసం ఒకే వేదికపై వీరిద్దరిని చూడాలన్న కోరిక అభిమానులలో చాలా ఉందనే చెప్పాలి. గతంలో పలు సినిమా వేడుకలలో కలిసి పాల్గొన్నటువంటి వీరిద్దరూ తాజాగా మరోసారి వేదికను పంచుకోబోతున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ . ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ లేదా వైజాగ్ లో ఏర్పాటు చేయాలని భావించారట.

 

ఇంకా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి నటసింహం బాలయ్యను ఆహ్వానించాలని మేకర్స్ భావించారని తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి దగ్గర ప్రస్తావించడంతో బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరైతే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది అంటూ పాజిటివ్ గా స్పందించారట. దీంతో ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నారని తెలియడంతో ఇద్దరు లెజెండరీ నటులను ఒకే వేదికపై చూడాలి అనే అభిమానుల కల కూడా నెరవేరబోతుందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -