Chiranjeevi: ఆ నెగిటివ్ కామెంట్స్ విషయంలో చిరు జాగ్రత్త పడుతున్నారా?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా మారిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీకి చెందిన ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది చిరంజీవి పేరే. సినిమాలతో నెంబర్ వన్ గా ఉన్న చిరంజీవి.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అనుకున్న స్థాయిలో హిట్లు అందుకోలేకపోయాడు. చాలాకాలం తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తో భారీ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్నిచూపుతున్నాడు.

 

అయితే బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ చేసిన క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చింది. సినిమా భారీ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎక్కడికి వెళ్లినా డైరెక్టర్ బాబీని ఆకాశాని ఎత్తేస్తున్నాడు. బాబీ ఎంతో ట్యాలెంట్ ఉన్న దర్శకుడు, అదీఇదీ అంటూ తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు.

 

చిరంజీవి దర్శకుడు బాబీని ఇంతలా పొగడటానికి కారణం ట్రోలింగ్స్ అనే ప్రచారం సాగుతోంది. అవును గతంలో చిరంజీవి మీద వచ్చిన ట్రోల్స్, నెగిటివ్ కామెంట్ల కారణంగా చిరంజీవి జాగ్రత్తపడుతున్నారనే టాక్ నడుస్తోంది. చిరంజీవి గత సినిమా ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా.. దానిని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే చిరంజీవి కూడా ఓ సందర్భంలో కొరటాలను పరోక్షంగా విమర్శిస్తూ.. ‘కొందరు దర్శకులు సెట్ లోనే అన్నీ రాసేస్తున్నారని దీని వల్ల ఫలితాలు తారుమారు అవుతున్నాయి’ అని అన్నాడు.

 

దీంతో నెటిజన్లు చిరంజీవి మీద తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఆచార్య’ ప్లాఫ్ క్రెడిట్ ను కేవలం దర్శకుడి మాత్రమే అంటగట్టడం, చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యల మీద తీవ్రస్థాయి ట్రోలింగ్ నడిచింది. దీంతో గత అనుభవాల నేపథ్యంలో చిరంజీవి దర్శకులను విమర్శించకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పుడు దర్శకుడు బాబీని చిరంజీవి తెగ పొగుడుతున్నాడనే ప్రచారం నడుస్తోంది. కాగా మెగాస్టార్‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇప్పటికే 108 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్ లో 1.7 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -