Chiranjeevi: చిరంజీవి కూతురు చేసిన తప్పు వల్లే మెగాస్టార్ పై విమర్శలు.. అక్కడే పొరపాటు జరుగుతోందా?

Chiranjeevi: చిరంజీవి హీరోగా యు వి క్రియేషన్స్ నిర్మాణంలో బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహించబోయే చిత్రానికి దసరా సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది. చిరు కెరియర్ లోనే అత్యధికంగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబోతున్నారని సమాచారం. చిరంజీవి కెరియర్ లోనే మంచి హిట్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఈ సినిమా కూడా సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం.

నిజానికి చిరంజీవికి చాలా సంవత్సరాలుగా సరియైన హిట్ పడలేదు. ఈ సినిమా అతనికి 156వ సినిమా అవుతుంది. ఈ సినిమా ఎలా అయినా అతనికి హిట్ పడాలి. దానికోసమే చాలా స్క్రిప్ట్ లు చూశాడు చిరంజీవి. మధ్యలో కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాను చేయటానికి డిసైడ్ అయ్యాడు, కానీ మళ్ళీ ఎందుకో ఆ సినిమాను పక్కనపెట్టి మరీ ఈ సినిమాకు పచ్చ జెండా ఊపాడు చిరంజీవి. ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, ఇంతకుముందు సినిమాల లాగా రీమేకులు చేయడం లేదు.

మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చిరంజీవి ఒక విషయంలో మాత్రం తప్పటడుగు వేస్తున్నాడు అదే ప్రేక్షకులకు కూడా నచ్చటం లేదు. చిరు ఫ్యాన్స్ సైతం ఈ విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు అది ఏమిటంటే చిరు పెద్ద కూతురు సుష్మిత విషయంలో పుత్రికా ప్రేమని పక్కన పెట్టమంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే చిరు రీ ఎంట్రీ సినిమాలలో చాలా మటుకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది సుష్మిత కొణిదెల అయితే చిరు స్టైలింగు ట్రెండీగా లేదని ప్రేక్షకులు బాహాటంగానే చెప్పారు.

బోలాశంకర్ సినిమాలో అయితే సుస్మిత సమకూర్చిన కాస్టింగ్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు తీస్తున్న వశిష్ట సినిమా భారీ బడ్జెట్, అది కూడా సోషియో ఫాంటసీ మూవీ. అటువంటి అప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ నీతా లుల్లా లాంటి వాళ్ళనో తీసుకోవాలి. అంతేకానీ ఇంత పెద్ద బాధ్యతను ఆమె చేతిలో పెట్టి రిస్క్ చేయవద్దు అంటున్నారు చిరు ఫ్యాన్స్.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -