Chiranjeevi: విశాఖ వాసులతో అనుబంధాన్ని తెలిపిన చిరు

Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఆ క్రేజే వేరు. ఆయనకు వైజాగ్ తో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. తన సినీ కెరీర్ మొదట్లోనే విశాఖ నగరంలో ఆయన ఎక్కువగా లొకేషన్లను ఎంపిక చేసుకునేవారంటే ఆయనకు ఎంత ఇష్టం ఉందే అర్థం చేసుకోవచ్చు. విశాఖలో నటించాలన్నా బీచ్ వాతావరణంలో షికారు చేయాలన్నా మెగాస్టార్ కు చాలా ఇష్టం. ప్రతిసారి తన మూవీ ఈవెంట్లలో మెగాస్టార్ విశాఖ బీచ్ గురించి చెబుతూ ఉంటారు. విశాఖలో ఏ ఈవెంట్ కు ఆయన హాజరైనా రెట్టింపు ఉత్సాహంతో ఉంటారు.

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విశాఖలో తన అభిమానులతో మాట్లాడారు. విశాఖతో తనకు ఉన్న కనెక్షన్ గురించి తెలిపారు. అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. విశాఖకు వచ్చిన ప్రతిసారి ఉద్వేగానికి లోనవుతానని, వైజాగ్ అంటే తనకు అంత ఇష్టమని తెలిపారు. తాను వైజాగ్ లో ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నట్లు వెల్లడించారు.

 

విశాఖ వాసుల గురించి మాట్లాడుతూ ఇక్కడి మనుషులు చాలా మంచివారని, ఈ మధ్యనే విశాఖకు సమీపంలో స్థలం కొన్నట్లు తెలిపారు. తాను కూడా ఇకపై విశాఖ వాసుడిని అవుతానని తెలిపారు. చిరు ఆ మాట అనగానే ఉత్తరాది అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైంది.

 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ విశాఖకు వెళ్లేందుకు మెగాస్టార్ చిరంజీవి కృషి చేస్తారని కూడా వేదిక వద్ద చర్చ సాగింది. ప్రత్యేకించి ఆయన తన తదుపరి జీవితాన్ని విశాఖ భీమిలిలో గడపనున్నట్లు, త్వరలోనే అక్కడ ఇల్లు కట్టుకుని విశాఖలోనే జీవించనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -