Chiranjeevi: చిరంజీవి ఇచ్చిన ఆ ఐడియాతో కథను రెడీ చేసిన రైటర్స్.. ఇంతకు అదేమిటంటే?

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి తెలుగు నాట నటుడుగా తనకంటూ చరగని ముద్ర వేసుకున్నాడు. ఇక చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చాడు. మరి చిరంజీవి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అలా చిరు టాలీవుడ్లో ప్రస్తుతం అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు.

ఇదిలా ఉంటే అప్పట్లో చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా భారీ స్థాయి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్లో వచ్చింది. అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఆ సినిమాలో ఒక పాపకు వైద్యం చేయించడానికి చాలా లక్షలు ఖర్చు అవుతాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం చంద్రుడు పైకి వెళ్లడానికి ఒక మిషన్ నిర్వహించింది.

అలా చంద్రుడు పైకి వెళ్లి వచ్చిన వారికి కోటి రూపాయలు డబ్బులు ఇస్తానని ప్రకటన చేసింది. ఈ ప్రకటనను చూసి చిరంజీవి స్పేస్ షిప్ లో చంద్రుడు పైకి వెళతాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడు కుమార్తె ఉంగరం పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరకడంతో శ్రీదేవి దానిని వెతుక్కుంటూ భూమ్మీదకి వస్తుంది. కానీ చంద్రుడులాంటివన్నీ సహజంగా ఉండవని దర్శకుడు కే రాఘవేంద్రరావు, ఈ చిత్ర బృందం భావించిందట.

ఈ విషయంలో చిత్ర యూనిట్ కి అనేక రకాల చర్చలు నడుస్తూ ఉండగా చిరంజీవి మానస సరోవరం సినిమా బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుందని అడిగాడట. దాంతో ఈ ఆలోచన చిత్ర యూనిట్ అందరికీ నచ్చిందట. అంతేకాకుండా కథను కూడా ఆ విధంగానే డిజైన్ చేశారు. అలా చిరంజీవి ఇచ్చిన ఒక్క ఐడియాతో దర్శక, నిర్మాతలు స్టోరీ రెడీ చేశారు. అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఆ విధంగానే ఈ సినిమా మరో స్థాయిలో సక్సెస్ అందుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -