Chiranjeevi: మెగాస్టార్ సినిమాలకు గుడ్ బై చెప్పేది అప్పుడేనా?

Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ లాంటి వారు ‘మెగాస్టార్ చిరంజీవి’. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ తన మార్క్‌ ను కాపాడుకుంటూ వస్తున్నారు. 1978లో వచ్చిన ‘పునాది రాళ్లు’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించారు. అయితే ఈ సినిమాకంటే ముందు ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. ‘స్వయంకృషి’ సినిమాతో హీరోగా చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ఘరానా మొగుడు, ఖైదీ, ఛాలెంజ్, కోండవీటి రాజా’ వంటి హిట్ సినిమాలు చేశారు. 1990లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా సోషియో ఫాంటసీ మూవీగా నిలిచింది. ‘గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు, ముఠామేస్త్రీ, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, మాస్టర్, చూడాలని ఉంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, స్టాలిన్’ వంటి సినిమాలు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో సినీ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు.

 

రాజకీయాల్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ సినిమాల్లో కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ‘ఖైదీనంబర్ 150’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ‘సైరా నరసింహారెడ్డి, ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాల తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే మెగా అభిమానుల్లో ఏదో వెలితి మిగిలిపోయింది. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.. ఇప్పుడు నటిస్తున్న ఏ సినిమాల్లోనూ అది కనిపించడం లేదని భావించారు. చిరంజీవి లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. చిరంజీవి కెరీర్‌లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీకి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్, సాంగ్స్ విడుదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

 

 

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి షాకింగ్ అప్‌డేట్ వచ్చింది. ఏడాదికి మూడు సినిమాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్న చిరంజీవి.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే అతనికి 70 ఏళ్ల వచ్చే వరకు సినిమాలు చేయాలని భావిస్తున్నారట. ఆ తర్వాత చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ సినిమాలకు దూరం కానుండటంతో అతని అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -