Chiranjeevi: చిరంజీవి సినిమాలకు రూ.100 కోట్ల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ లేదా?

Chiranjeevi: సీని కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవికి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. ఊహించిన స్థాయిలో ఏ సినిమా సక్సెస్ కాలేకపోతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఢీలా పడుతున్నాయి. ‘ఖైదీ నంబర్.150, సైరా నరసింహా రెడ్డి, ఆచార్య’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాలు కొంత వరకు పర్వాలేదనిపించినా.. ఆచార్య సినిమాకు రామ్ చరణ్, చిరంజీవి నిర్మాతలకు డబ్బులు వాపస్ ఇవ్వాల్సి వచ్చింది. గాడ్ ఫాదర్ సినిమా మాత్రం హిట్ కొట్టింది. అయినా రూ.100 కోట్ల కలెక్షన్‌లో పేరు సంపాదించుకోలేకపోయింది.

 

 

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా మెగాస్టార్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రమే.. మెగా అభిమానులను అలరింపజేశాయి. చిరంజీవి-రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించడం వల్ల కొంతవరకు ఆకట్టుకుంది. కానీ పూర్తి స్థాయిలో సినిమా సక్సెస్ కాలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ, టీవీల్లో పర్వాలేదనిపించుకుంది. జెమినీ టీవీలో ఇటీవల ఆచార్య సినిమాను ప్రదర్శించారు. దీంతో ఆ ఛానెల్ టీఆర్‌పీ రేటింగ్ 6.30 వచ్చింది. అయితే ఎఫ్‌-2, అఖండ, బంగార్రాజు సినిమాల కంటే తక్కువ టీఆర్‌పీ వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాల కంటే ఈ సినిమాకే ఎక్కువ టీఆర్‌పీ రేటింగ్ నమోదైంది.

 

 

ఓటీటీల హవా పెరగడంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ప్రస్తుతం తగ్గిందనే చెప్పుకోవచ్చు. సీనియర్ హీరోలకు సైతం క్రేజ్, మార్కెట్ ఢీలా పడింది. గాడ్ ఫాదర్ సినిమా హిట్ అయినా.. రూ.60 కోట్లు కలెక్షన్ కూడా రాబట్టలేదు. అలాగే భారీ అంచనాలతో విడుదలైన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో పలువురు చిరంజీవి మార్కెట్ ముగిసినట్లేనని కామెంట్లు చేస్తున్నారు. రూ.100 బడ్జెట్ సినిమా చేయలేకపోతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మార్క్‌ ను దాటుతారా? లేదా? అనేది వేచి చూడాలని అంటున్నారు. కాగా, చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -