Chiranjeevi- Garikapati Controversy: గరికపాటి వ్యవహారంలో చిరంజీవిదే పూర్తి తప్పయిందా?

Chiranjeevi- Garikapati Controversy: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పట్ల గరికపాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పట్ల గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఈ వివాదం చెలరేగింది.ఇలా గరికపాటి మెగాస్టార్ గురించి మాట్లాడిన వ్యాఖ్యల పట్ల మెగా అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున గరికపాటిని ఎంతో అవమానకరంగా మాట్లాడారు.

ఇక ఈ వివాదం తీవ్రస్థాయిలో ముదిరిపోయింది. ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా గేయ రచయిత అనంత శ్రీరామ్ చిరంజీవి గారి ఎదుట గరికపాటిని గరికతో పోలుస్తూ చేసినటువంటి కామెంట్స్ తీవ్రదుమారం రేపాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఆధారాభిమానాలు ముందు గరికపాటి చాలా తక్కువ అయినప్పటికీ ఈ విషయంపై మెగా అభిమానులు మాట్లాడకూడదని మెగా బ్రదర్ నాగబాబు చెప్పినప్పటికీ ఏమాత్రం వివాదాలు ఆగలేదు.

ఇకపోతే ఈ విషయంలో గరికపాటి పూర్తిగా విజయం సాధించారని మెగాస్టార్ చిరంజీవిదే తప్పు అని చెప్పాలి.ఒక అభిమాని తీవ్రస్థాయిలో తమ అభిమాన హీరో గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ బాధ్యత పూర్తిగా హీరోదే అవుతుంది. ఇలా గరికపాటి గురించి అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్న చిరంజీవి మాత్రం మౌనం వహించడం పట్ల అభిమానులను తాను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని అర్థం.

ఇలా మెగా అభిమానుల ట్రోలింగ్ కి తట్టుకోలేక గరికపాటి ఏకంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా మరికొందరు ఈ వివాదంపై స్పందించి గరికపాటి పై విమర్శలు చేశారు. గరికపాటిని అభిమానులు అనాల్సిన మాటలు అన్నీ అన్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందించి ఆయన పెద్దవారు ఆయన అన్న మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనడంతో మరికొందరు చిరంజీవిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గరికపాటి విషయంలో మెగాస్టార్ పూర్తిగా విఫలమయ్యారని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -