Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: ఈ సంక్రాంతికి మెగా అభిమానులకు మంచి విందు ఇవ్వడానికి సిద్దమయ్యాడు చిరంజీవి. “వాల్తేరు వీరయ్య” గా అలరించడానికి ఈ సారి సిద్దమైపోయాడు చిరు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న చిరంజీవి.. ప్రస్తుతం సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదల అయిన అప్ డేట్స్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇక దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

 

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి పలు కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొంటూ.. చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమాకు మరియు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు ఈ సందర్భంగా చిరు పంచుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. తనపై వచ్చిన వివిధ కామెంట్స్ కు రిప్లై ఇచ్చాడు చిరంజీవి. సినిమా షూటింగ్ లో భాగంగా శృతి, రవితేజ, డైరెక్టర్, నటీనటులతో బాగా ఎంజాయ్ చేసానని, సినిమా దర్శకుడు బాబీ ప్రత్యేక ఆసక్తితో తీసారని చెప్పుకొచ్చారు చిరు.

 

సంయమనం అవసరమే..
ఎప్పటి నుండో “మీకు అతి మంచితనం అవసరమా?” అని ఫ్యాన్స్‌ చేస్తున్న కామెంట్స్ కు రిప్లై ఇచ్చాడు చిరు. దానికి సమాధానంగా.. “కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదరుతిరిగితే నా అహం చల్లారుతుందేమో కానీ, సినిమాకు భారీగా నష్టం వస్తుంది. అభిమానులు నిరాశ చెందుతారు. నా ససయమనం ఇంత మందికి మంచి చేస్తుందంటే నేను వెనక్కి తగ్గుతాను. అంతిమ ఫలితం చూస్తాను” మంచి కోసం ఎంత తగ్గినా తక్కువేనని చిరు అన్నారు. ఇలా ఉండడమే సరైనదని అన్నారు చిరంజీవి.

 

ఇక దర్శకత్వం గురించి స్పందిస్తూ.. అవకాశం వచ్చి, తాను చేయగలను అనే నమ్మకం వస్తే.. తప్పకుండ భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానని అన్నారు చిరంజీవి. తన జీవితాంతం సినిమాతో ఉంటానని, సినిమాతో మమేకం అవ్వడమే తన ఆశయమని ప్రకటించారు. టికెట్స్ దరల పెంపకంపై స్పందించిన చిరు.. ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించాలని వాటి బాధ్యత అవి నిర్వర్తిస్తాయని తెలిపారు. సినిమా టికెట్ ధరను పెంపకానికి సహకరించినందుకు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -