Chiranjeevi: ఖరీదైన ప్రాపర్టీ అమ్ముకున్న మెగాస్టార్ చిరంజీవి?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన నేటికీ యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇలా సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల వ్యాపారాలు ద్వారా మెగాస్టార్ చిరంజీవి భారీగా ఆస్తులు కూడా పెట్టారు. ఇకపోతే ఈయన కెరియర్ మొదట్లో హైదరాబాదులోని ఫిలింనగర్ సమీపంలో చాలా విలువైన భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో లక్షలు పెట్టి కొన్న భూమి ప్రస్తుతం వందల కోట్ల విలువ చేస్తుంది.ఇలా కొన్ని వందల కోట్ల ఆస్తిపాస్తులు కలిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక ఖరీదైన ప్రాపర్టీ అమ్మినట్లు తెలుస్తోంది.

ఫిలింనగర్ మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి ఎంతో విలువైన స్థలాన్ని ఒక దినపత్రిక యజమానికి అమ్మినట్టు తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి దినపత్రిక యజమాని ఆ స్థలం తనకు విక్రయించాలనీ మెగాస్టార్ చిరంజీవి పై ఒత్తిడి చేశారట. ఆ స్థలం తనకు విక్రయిస్తే అక్కడ తన దినపత్రిక కార్యాలయం ప్రారంభించుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని అందుకే ఆ ప్రాపర్టీ అమ్మాలని మెగాస్టార్ ను పలుసార్లు అడిగారనీ తెలుస్తోంది.

ఈ విధంగా ఆ యజమాని ఒత్తిడి కారణంగానే మెగాస్టార్ తనకు ఆ ప్రాపర్టీని అమ్మినట్లు సమాచారం.ఇప్పటికే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీలింగ్స్ పూర్తి అయ్యాయని దాదాపు ఈ స్థలం 70 కోట్ల రూపాయలకు మెగాస్టార్ అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.అప్పట్లో ఈ స్థలాన్ని కేవలం 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని అయితే ఇప్పుడు అటు ఇటుగా 70 లక్షల వరకు అమ్మడు పోయిందని తెలుస్తోంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -