Megastar Chiranjeevi: అభిమానిని కలిసేందుకు త్వరలో గాంధీకి మెగాస్టార్‌!

Megastar Chiranjeevi: నేటి కాలంలో వైద్యరంగం ఎంతో ఎదిగిపోయింది. కొత్త కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎంత పెద్ద సర్జరీలైన సునాసయంగా చేస్తున్నారు. ఒక్కప్పుడు ఆపరేషన్‌ థియేటర్లలోకి పేషెంట్‌ను తీసుకెళ్తే ఆ రోగి బయటకు వచ్చే వరకు కుటుం సభ్యుల్లో ఆందోళన ఉండేది. కానీ.. ఇప్పుడు నూతన సాంకేతికతతో రోగి కూడా వైద్య బృందంలో కలిసిపోయి పాటలు పాడుతూ వారికి ముచ్చటిస్తూ వివిధ రకా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. గతంలో క్యాన్సర్, బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చిందంటే వారిక బ్రతకరు అనేకునే వారు. కానీ.. ఇప్పుడు మాత్రం అలాంటి వారిని సైతం సృహలోనే ఉంచి సర్జరీని విజయవంతంగా చేస్తున్నారు వైద్యులు.

ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఇలాంటి ఓ ఆపరేషన్‌ వివరాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్రెయిన్‌ సర్జరీకోసం గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధురాలికి అక్కడి వైద్యులు ఆమెకు ఎలాంటి మత్తు ఇంజక్షన్లు ఇవ్వకుండా అది కూడా సినిమా చూపిస్తూ ఆమెతో ముచ్చటిస్తూ చేసిన ఆ సర్జరీ విజయవంతం అయింది. అయితే ఆస్పత్రిలో జరిగిన సర్జరీ వైరల కావడంతో ఆ వార్తా హిరో చిరంజీవి వరకు వెళ్లింది. అయితే ఆ బామ్మ వివరాలు తెలుసుకోవాలని చిరంజీవే తన పీఆర్వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి పంపి వివరాలు సేకరించమన్నారు.

అయితే ఆ బామ్మ మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని అంట. ఆమెకు సర్జరీ చేసే సమయంలో చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమానే చూసిందంట. గాంధీకి వెళ్లిన ఆనంద్‌ సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు సేకరించి ఆ వృద్ధురాలికి సర్జరీ చేసిన వైద్య బృందాన్ని కూడా కలిసి మాట్లాడారు. అక్కడి నుంచి ఆనంద్‌ చిరంజీవికి వివరాలన్నీ తెలిపాడు.అయితే బామ్మ తన అభిమాని తెలుసుకున్న చిరంజీవి ఆమెను స్వయంగా కలిసి ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు నిర్ణయించుకున్నారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రికి వస్తానని బామ్మను కలిసి మాట్లాడుతానని చిరంజీవి మాటిచ్చినట్లు పీఆర్‌లో ఆనంద్‌ సూపరింటెండెంట్‌ రాజారావుకు తెలిపారు.అభిమానులను కలవడం, వారికి సహాయం మెగాస్టార్‌కు తరచూ చేస్తుంటారు. ఇటీవల తన అభిమానికి క్యాన్సర్‌ సోకిందని ఆస్పత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాక చిరంజీవి సాయం చేస్తూ తోడ్పాటునందిçస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -