Chiranjeevi-Meher Ramesh: చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో మరో మూవీ.. మెగాస్టార్ తెలిసి తప్పు చేస్తున్నాడా?

Chiranjeevi-Meher Ramesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నటువంటి మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఈయన చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. ఇలా డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం ఆయనకు సినిమా అవకాశం కల్పించారు.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్లు ఏ సినిమా కూడా ఈ విధంగా కలెక్షన్లను సాధించలేదని చెప్పాలి. మెగాస్టార్ వంటి స్టార్ హీరో సినిమా కేవలం 22 కోట్ల రాబట్టింది అంటే ఆ సినిమా ఎలా డిజాస్టర్ అయిందో అర్థమవుతుంది.

ఇలాంటి ఒక భారీ డిజాస్టర్ తర్వాత కూడా చిరంజీవిలో ఏదైనా మార్పు వచ్చిందంటే లేదు ఆయనకు తిరిగి మరో అవకాశం ఇచ్చారు .దీంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు మెహర్ రమేష్ సినిమా అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా ఆయనని దూరం పెడుతున్నారు అలాంటిది చిరంజీవి ఒక డిజాస్టర్ ఎదుర్కొన్న తిరిగి మరి ఆయనకు ఎలా అవకాశం కల్పించారు అంటూ అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా మరోసారి చిరంజీవి సినిమా ఆకాశం కల్పించారని తెలియడంతో ఈయన తెలిసి తెలిసి మరి తప్పు చేస్తున్నారా అని అభిమానులు కూడా భావిస్తున్నారు అయితే ఈయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించడం లేదు కానీ ఆయన కుమార్తె సుస్మిత నిర్మించిన గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థలో నాలుగు కోట్ల రూపాయలకు మించి బడ్జెట్ కాకుండా ఉండే ఒక చిన్న సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారట. ఇలా ఫ్లాప్ ఎదుర్కొన్నప్పటికీ మెహర్ రమేష్ చిరంజీవి సమీప బంధువు కావడంతోనే తన కుమారు ఒక అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. మరి ఈ అవకాశానైన రమేష్ ఉపయోగించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -