Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

Chiranjeevi: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ స్టార్ హీరో నటుడు చిరంజీవితో పాటు పలువురికి పద్మ విభూషణ్ అవార్డుని సత్కరించిన విషయం తెలిసిందే. చిరంజీవితో పాటుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పద్మశ్రీ అవార్డులు పొందిన దాసరి కొండప్ప, ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోమాలాల్, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్యలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదుగురిని ఘనంగా సన్మానించింది. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతులను కూడా అందించింది.

 

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు పద్మ పురస్కారాలు పొందినవారిని సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాజకీయాలు హుందాగా ఉండాలి. వ్యక్తిగత విమర్శలు తగవు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అలా నేను కూడా వ్యక్తిగత విమర్శల రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను తిప్పికొట్టగలిగితేనే రాజకీయాల్లో కొనసాగచ్చు.

అలాంటి పరిస్థితి నేడు ఉంది అంటూ చిరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనంతరం వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడు అని చిరంజీవి కొనియాడారు. మాజీ ప్రధాని వాజపేయిలో ఉన్నంత హుందాతనం ఆయనలో ఉందని అన్నారు. వెంకయ్య వాగ్ధాటికి తాను పెద్ద అభిమానిని అని వెల్లడించారు. చిన్నతనం నుంచి ఆయన తనకు స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయాల్లో రానురాను దుర్భాషలు ఎక్కువైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -