KTR: కేటీఆర్ సీఎం అయ్యేది అప్పుడేనా? షాకింగ్ గా మారిన కేసీఆర్ కామెంట్స్

KTR: దసరా రోజున టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమది జాతీయ పార్టీ అని నేతలు చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తారని, ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్కరం తిప్పుతారని చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయం కవడంతో మంత్రి కేటీఆర్ సీఎం పదవి వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ సీఎంగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించడం కష్టం. ఇక్కడ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అధికారులతో సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

దీంతో కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం చేయడం ఖాయమనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు కూడా పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఇటీవల జరుగుతోంది. మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దాంతో కేటీఆర్ కు సీఎం కావడం ఖాయమనే ఊహాగానాలు వినిపించాయి. కానీ జాతీయ పార్టీ ఏర్పాటు సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను చాలామంది గుర్తు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా తెలంగాణను తాను వదిలిపెట్టని, సీఎంగా ఉంటానంటూ వెల్లడించారు.

తెలంగాణ నుంచే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ చెప్పుుకొచ్చారు. ఈ మాటలతో కేసీఆర్ తెలంగాణను వదిలేసి కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వార్తలకు చెక్ పడింది. కానీ జాతీయ పార్టీ వెనుక కేసీఆర్ బిగ్ స్కెచ్ వేశారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీకి 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు ునెలల తర్వాత 2024 మేలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. కేసీఆర్ ముందుగా అసెంబ్లీ ఎన్నికల్ల ోపోటీ చేస్తారని, టీఆర్ఎ్ మళ్లీ గెలిస్తే సీఎంగా కొనసాగుతారని చెబుతున్నారు. తిరిగి 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తారని, లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అత్యధిక సీట్లు వస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

అప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల తర్వాతనే కేటీఆర్ కు సీఎం పదవి అప్పగించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఇప్పుడు సీఎం పదవికి రాజీనామ చేసి కేటీఆర్ కు అప్పగిచి రాజకీయాల్లోకి వెళితే అంత పలుకుబడి ఉండదు. సీఎం హోదాలో ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ నేతలు గౌరవిస్తరాు. ఎలాంటి పదవి లేకపోతే ఎవరూ పట్టించుకునే అవకాశం అసలు ఉండదు. దీంతో ఇప్పట్లో కేటీఆర్ కు సీఎం పదవి అప్పగించే అవకాశం ఉండదనే చర్చ జరుగుతోంది. వవచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తర్వాతనే కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాతనే కేటీఆర్ సీఎం అవుతారా.. లేదా అనే దానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -