CM Jagan: అభ్యర్థులను తారుమారు చేస్తున్న సీఎం జగన్.. ఎన్నికలంటే ఇంత భయమా అంటూ?

CM Jagan: వైసీపీ అధినేత ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరి అర్థం కాదు. ఎందుకు తీసుకుంటారో అర్థం కాకపోయినా… ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం జగన్ లోని ఓటమి భయాన్ని అర్థం అయ్యేలా చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన దగ్గర నుంచి ఆయన కన్ఫ్యూజ్ అవుతూ… అభ్యర్థులను, క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆయన నిర్ణయాలు చూస్తున్న వైసీపీ క్యాడర్.. అభ్యర్థుల ప్రకటన జరిగినా వారే తమ ఎమ్మెల్యే అభ్యర్థి అని బలంగా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే.. తొలి జాబితాలో ఉన్న అభ్యర్థి పేరు.. తర్వాత జాబితాలో వేరే స్థానానికి పోతుంది. అందుకే.. ఇప్పుడు ప్రకటించిన వారందరికీ అదే స్థానాల్లో బీఫాంలు ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. బీఫాంలు ఇచ్చినా.. వారే నామినేషన్ వేస్తారా? వేయరా అనే అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఇప్పటి వరకూ 9 జాబితాల్లో 80 స్థానాలకు పైగా అభ్యర్థులను ప్రకటించినా.. ప్రచారం మాత్రం కొందరే చేస్తున్నారు. ఎందుకంటే.. తర్వాత ఎవరి సీటు ఉంటుందో ఎవరి సీటు ఊడుతుందో తెలియడం లేదు. అందుకే ఇప్పటి నుంచి ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లి జేబులు గుల్ల చేసుకోవడం అమాయకత్వం అవుతుందని భావిస్తున్నారు. అంతా చేసిన తర్వాత సీటు మార్చితే మొదటి నుంచి అక్కడ ప్రచారం చేద్దామని ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థులు స్థబ్దుగా ఉంటున్నారు. కొంతమంది ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినా.. క్యాడర్ సహకరించడం లేదు. ఎందుకంటే ఆయా నియోజవర్గాల్లో ఆశావహులు చాలా మంది ఉంటున్నారు. వారికి కాదని ప్రస్తుత అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తే తర్వాత సమస్యలు తలెత్తొచ్చు. ఎందుకంటే.. జగన్ సడెన్ గా అభ్యర్థిని మార్చేసి ఆశవహులకు టికెట్ ఇస్తే.. అప్పుడు వారు క్యాడర్ ను దూరం పెట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. అధినేతకు ఓ క్లారిటీ వచ్చి అభ్యర్థిని ఫిక్స్ చేసి.. బీఫాం ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాతే బయటకు వెళ్దామని అనుకుంటున్నారు.

క్యాడర్ కన్ఫ్యూజ్ అవ్వడంలో కూడా అర్థం లేకపోలేదు. అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చి జగన్ క్యాడర్‌కు సడెన్ షాక్ ఇచ్చారు. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదట ప్రకటించిన సింహాద్రి చంద్రశేఖర్‌ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్‌బాబును మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మొదట ప్రకటించింది. జగన్ ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు రమేష్ బాబు స్థానంలో చంద్రశేఖర్ ను మార్చారు.

డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు మూడుసార్లు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారు. అయితే, మచిలీపట్నంతో డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, వారి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. 35 ఏళ్లుగా ఆయన అంకాలజిస్ట్‌గా ప్రజలకు వైద్య సేవలందించారు. అయితే, జగన్ మొదట చంద్రశేఖర్‌ను అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదేశించారు. కానీ.. ఆయన అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో.. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. మొత్తానికి జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే.. ఇక్కడే పోటీ చేయాలని గట్టిగా ఆదేశించే స్థాయి నుంచి అభ్యర్థికి ఇష్టమైన స్థానానికి మార్చుతున్నారు. అయితే.. ఈ చర్యలు క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. తమ అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -