CM Jagan-Chandrababu: చంద్రబాబు ఛాలెంజ్ ను స్వీకరించే దమ్ము జగన్ రెడ్డికి ఉందా.. ఏమైందంటే?

CM Jagan-Chandrababu: ఏపీ రాజకీయాల్లో సినిమా డైలాగులు, పంచులు, కౌంటర్లు తప్ప.. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ అధినేత జగన్ పుణ్యమా అని ఈ సినిమా డైలాగులు పీక్స్‌కి చేరాయి. జనం కూడా వీటినే ఎంజాయ్ చేస్తున్నారు. రేపు టీడీపీ వస్తే ఏం చేస్తుంది? వైసీపీ గెలిస్తే ఎలా పాలిస్తుంది అని ఆలోచించే గ్యాప్ కూడా లేకుండా డైలాగుల మీద డైలాగులు పేలుతున్నాయి. అయితే, ఆ సంప్రదాయానికి చంద్రబాబు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. గత పదేళ్ల ప్రభుత్వంపై చర్చకు సవాల్ విసిరారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలనలో ఏం జరిగింది. 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలనలో ఏం జరిగిందో చర్చకు సిద్దమా? అని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ చేశారు.

సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుదు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మడానికి సిద్దం లేదని చంద్రబాబు జగన్ ఉద్దేశించి అన్నారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ఇంకా యాభై రోజుల్లో అరాచకపాలనకు స్వస్తి పలుకుతామని చెప్పారు. ఫ్యాన్ రెక్కలు ఊడిపోయిన విసిరేసే రోజలు దగ్గర పడ్డాయని చంద్రబాబు ద్వజమెత్తారు. వరం ఇచ్చిన శివుడునే బూడిత చేయాలనుకున్న భస్మాసురిడికి పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని అన్నారు. సిద్దం సభతో ప్రజల్లోకి వెళ్లి భూటకపు ప్రసంగాలు, అబద్దపు లెక్కలు చెప్పడం కాదు.. ఎవరిది అభివృద్ధి పాలనో.. ఎవరికి విధ్వంస పాలనో జనం ముందే చర్చిద్దాం వస్తావా? అని జగన్ కు చంద్రబాబు బహిరంగ సవాల్ చేశారు. టైం, ప్లేస్ జగన్ నే చెప్పాలి. ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా.. ఏం అంశం మీద అయినా చర్చిద్దాం. మీరు రెడీ అంటే నేను రెడీ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి ప్రజాస్వామ్యంలో ఇలాంటి డిబెట్‌లు చాలా ముఖ్యం. అమెరికా ఎన్నికల్లో కూడా పోలింగ్ కు ముందు ప్రెసిడెంట్ అభ్యర్థులు మధ్య మూడు డిబెట్లు జరుగుతాయి. దశలవారీగా జరిగే ఈ డిబెట్లలో ఎవరు ఏం చేశారు? భవిష్యత్ లో ఏం చేస్తారో చెబుతారు? కాస్త వ్యక్తిగత విమర్శలు ఉన్నప్పటికీ.. సబ్జెక్ట్ పై అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిస్కషన్లు జరుగుతాయి. దీని బట్టి ప్రజలకు ఎవరి చిత్తశుద్ది ఎంతో క్లియర్‌గా అర్థం అవుతుంది. ఎవరికి ఓటు వేయాలో తెలుస్తోంది. అమెరికాలో ఈ మూడు డిబెట్లతోనే ఎన్నికల ఫలితాలు అంచనా వేయోచ్చు. మన దగ్గర కూడా అలాంటి డిబెట్లు జరిగితే మంచిదే. చంద్రబాబు చేసిన సవాల్‌ను జగన్ స్వీకరిస్తే.. గెలుపోటముల సంగతి పక్కన పెడితే.. ఓ మంచి సంప్రదాయానికి నాంది పలికినట్టు అవుతుంది. మరి జగన్ స్వీకరిస్తారో స్వీకరించరో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -