Jagan: రైతులనే కాదు కోర్టులను కూడా మోసగిస్తున్న సీఎం జగన్.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jagan: రాజధాని అమరావతి మీద జగన్ సర్కారు పక్షపాతాన్ని చూపిస్తూనే ఉంది. కోర్టులో ఆదేశాలు ఇచ్చినప్పటికీ పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తుంది. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నామమాత్రానికి పనులు ప్రారంభించి తర్వాత ఆ పనిని గాలికి వదిలేసింది జగన్ సర్కార్. పనుల చిత్రాలను, నిధుల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించి చేతులు దులిపేసుకుంది. జగన్ ప్రభుత్వం తమనే కాకుండా కోర్టును కూడా మోసగిస్తోందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు.

ఎల్ పి ఎస్ లేఔట్లలో మౌలిక వసతుల కోసం 16,400 కోట్ల రూపాయల అంచనాలతో 13 జోన్లుగా విభజించి సీఆర్డీఏ టెండర్లను పిలిచింది. 11 జోన్లకి సంబంధించి టెండర్లు వేసి గుత్తేదారులను కూడా ఖరారు చేశారు. ఫ్లాట్ల వద్ద రహదారులు, విద్యుత్ స్తంభాలు, తాగునీరు, వాటర్ డ్రైనేజ్ తదితర మౌలిక వసతుల కల్పన అంటూ గతేడాది జూలైలో పనులు మొదలుపెట్టారు. దాదాపు 20 కిలోమీటర్ల మేరా కంప తొలగించారు. వాటిని ఫోటోలు తీసి పనులు ప్రారంభించామంటూ రాష్ట్రపతి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం సమర్పించింది.

46 వేల కోట్ల పనులకు టెండర్లకు పిలిచామని, ఎల్ పి ఎస్ లేఔట్లలో 16,400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొంది జగన్ ప్రభుత్వం. అయితే ప్రారంభించిన పనులను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో అక్కడ మళ్లీ ముళ్ళకంప పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. పనులు చేపట్టేందుకు సిఆర్డిఏ కి ప్రభుత్వం 3,500 కోట్ల రుణానికి రెండు ఏళ్లకాల పరిమితితో గ్యారంటీ ఇచ్చింది. రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు.

రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన రుణాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ను రాజధానిగా చేసే ఉద్దేశంలో ఉన్న జగన్ అమరావతి కోసం నిధులు వెర్చించడానికి ఇష్టపడటం లేదు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కోర్టు తీర్పు కారణంగా మాత్రమే జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నట్లు సి ఆర్ డి ఏ నటించిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -