Rayalaseema: సీమకు తీవ్రస్థాయిలో అన్యాయం చేస్తున్న సీఎం జగన్.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేకపోతుందా?

Rayalaseema: జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. నేను సీమ బిడ్డని సీమ ప్రజలు రైతులు పడే కష్టాలను చూసి చలించపోయానని తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ రైతు కూడా కష్టాలు లేకుండా పంటలు పండించుకోవచ్చు అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటిని కూడా గంగలో మంచారు.

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీమ కరువును తీర్చడం కోసం పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుంది అయితే చంద్రబాబు నాయుడు హయామంలో ఏకంగా 80% ప్రాజెక్టులు పూర్తి అయినప్పటికీ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో మిగిలిన 20 శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

సాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి చిత్తూరు జిల్లా వాసులకు సాగునీటి సౌకర్యాలను అందించాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్ఎన్ఎస్ఎస్ రెండవ దశ కింద కాలవల నిర్మాణాలను చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్మాణ పనులను వేగవంతం చేసి దాదాపు 80 శాతం పనులను పూర్తి చేశారు.

ఈ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో ఏకంగా1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఈ కాలువల నిర్మాణ పనులు పూర్తి కావాలి అంటే 75 కోట్ల రూపాయల విడుదల చేస్తే పూర్తి అవుతాయని అధికారులు పలు సందర్భాలలో ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అయితే ఈ 75 కోట్ల రూపాయల నిధులను జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయకపోవడంతో ఇప్పటివరకు ఆ నిర్మాణ పనులు అలాగే ఉండిపోయాయి. సీమ బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి ఈ 75 కోట్లు ఇవ్వడానికి మనసు రాలేదు. దీంతో గత నాలుగున్నర కాలంలో సీమ ప్రాంతానికి ఒక్క ఎకరాకి కూడా ఈయన సాగునీరు అందించలేనటువంటి ఒక అసమర్థత సీఎంగా మిగిలిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -