Kodali Nani: కొడాలి నానికి భారీ షాకివ్వబోతున్న జగన్.. కొడాలి నాని మైండ్ బ్లాంక్ కానుందా?

Kodali Nani: వైయస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారిలో కొడాలి నాని ఒకరు. కొడాలి నాని రాజకీయాలలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎవరైనా విమర్శలు చేస్తే వారి తాటతీస్తూ ఉంటారు. ఇలా జగన్మోహన్ రెడ్డి పై ఈగ బాగకుండా చూస్తున్నటువంటి కొడాలి నానికే జగన్మోహన్ రెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గుడివాడలో కొడాలి నానికి తెలియకుండా ఏ చిన్న పని కూడా జరగదు.

ఇలా కొడాలి నాని అడ్డాలో ఆయనకు తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలు జరగటం గమనార్హం. శనివారం కొత్త పెన్షన్ల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వల్లభనేని బాలశౌరి ముఖ్య అతిథిగా వచ్చారు కానీ ఈ విషయం మాత్రం కొడాలి నాని కి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదని ఆయన వర్గీయులు వల్లభనేని బాలశౌరి అనుచరులపై దాడికి దిగారు. ఈ విధంగా ఇలా ఇరువురి అనుచరులు దాడి చేసుకోవడంతో కార్లు కూడా ధ్వంసం అయ్యాయి కానీ పోలీసులు కేసుల వరకు వెళ్లకపోయినా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొడాలి నానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే వచ్చే ఎన్నికలలో కొడాలి నాని గట్టి షాక్ ఇవ్వబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయం గురించి కాస్త స్పష్టంగా ఉన్నారని తెలుస్తుంది. ఈసారి కొడాలి నానిని అసెంబ్లీలో కాకుండా లోక్ సభకు పంపించాలన్న ఆలోచనలో ఉన్నారని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ విధంగా కొడాలి నానిని లోక్ సభకు పంపించాలన్న ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాలశౌరిని గుడివాడకు పంపుతున్నారని భావిస్తున్నారు. మొత్తంగా వ్యవహారంలో గుడివాడలో… తన ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ ఉండటం తప్ప…. కొడాలి నాని ఏమీ చేయలేని పరిస్థితి. మరి కొడాలి నాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -