CM Jagan: మరో ప్రముఖ నేతకు షాకిచ్చిన సీఎం జగన్.. ఏం జరిగిందంటే?

CM Jagan: మరికొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలబడుతున్నటువంటి తరుణంలో అందరి చూపు టికెట్లపైనే ఉంది ఏ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారు ఎవరికి లేదు అన్న విషయంపై నాయకులతోపాటు కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించి కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

 

ఇకపోతే తాజాగా మరో సీనియర్ నాయకుడికి సీఎం జగన్ షాక్ ఇచ్చారని తెలుస్తోంది. క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటూ రాజ‌కీయాలు చేస్తూ ఉన్నారు. అయితే గత 15 సంవత్సరాలుగా ఈయన రాజకీయ జీవితం ఎటు కాని పక్షంలో ఉంది ఇక ఈయన రాజకీయాలలో ఎంతో సీనియర్ నాయకుడు అయినప్పటికీ తన కుమారుడిని ఒక్కసారైనా అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చేయాలని ఆరాటపడుతున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి బలరాం ప్రస్తుతం వైసీపీ చెంత చేరారు. ఈసారైనా తన కొడుకుకు చీరాల నుంచి టికెట్ వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీరికి నిరాశనే మిగులుస్తున్నారని తెలుస్తుంది. ప్ర‌స్తుతం చీరాల ఇన్‌చార్జ్‌గా క‌ర‌ణం త‌న‌యుడు వెంక‌టేష్ ఉన్నారు. అద్దంకిలో వ‌రుస‌గా తండ్రి, కొడుకులు ఓడిపోవ‌డం.. అక్క‌డ గొట్టిపాటి ర‌విపై పోటీచేస్తే గెల‌వ‌లేం అన్న డౌట్‌తో చీరాలలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు.

 

టిడిపి నుంచి వైసీపీ చెంతకు వచ్చినప్పటికీ వీళ్లు మాత్రం టిడిపి ప్రభుత్వం పై ఏనాడు విమర్శలు కురిపించలేదు ఇప్పటికీ టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈసారైనా జగన్ మోహన్ రెడ్డి తమ qకుమారుడికి టికెట్ ఇస్తారని ఆశగా ఉన్నటువంటి ఈయనకు అన్న ఈసారి మీరు తప్పుకోండి అంటూ జగన్ చాలా సున్నితంగా ఈయనకు టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయం బయటకు రాలేదు అయినప్పటికీ తన కుమారుడు వెంకటేష్ మాత్రం ఇన్ ఛార్జ్ గా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నియోజకవర్గం వ్యవహారాలన్నింటిని నిర్వహిస్తూ వస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -