Jagan: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నరేంద్ర మోదీ పేరు.. సీఎం జగన్ కొరివితో తల గోక్కుంటున్నారా?

Jagan:  స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం జగన్ చేస్తున్న విన్యాసాలు చూస్తే ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి వంద తప్పులు చేస్తున్నారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జగన్ ఈ విషయంలో చాలా తెలివైన ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ తనకు తాను చంకలు గుద్దుకున్నప్పటికీ తనకు తెలియకుండానే కొరివితో తల గోక్కుంటున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో ముందు ముందు జగన్కు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ విషయంలో మోదీ పేరును తెరపైకి తెస్తున్నారు. ఇప్పటి వరకూ సీమెన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా ఉన్న స్కిల్ కేంద్రాలను ఇప్పుడు మోదీ పేరు మీదకు మార్చేస్తున్నారు. విశాఖలో ఏయూలో ఉన్న అత్యాధునిక సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల పేరు మార్చేశారు. మోదీ ఫోటోతో ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకం పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినా ఎప్పుడూ మోదీకి కనీస క్రెడిట్ ఇచ్చేందుకు ప్రయత్నించని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు స్కిల్ కేసు నడుస్తున్న సమయంలో సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల పేర్లు మార్చేసి ప్రధాని మోదీ పేరు పెడుతున్నారు. అంటే ఇవన్నీ కేంద్ర నిధులతో నడుస్తున్న పథకం అన్నమాట.

అయితే నిజానికి స్కిల్ ప్రాజెక్టులో సీమెన్స్, డిజైన్ టెక్‌తో ఒప్పందం 2021లో పూర్తయింది. అన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించారు. కానీ ఖర్చు దండగ అని ట్రైనింగ్ ఆపేశారు. ఇప్పుడు అదే పేరుతో కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసి, సాక్ష్యాలు చూపించలేక తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఇందులో తమ పాత్ర ఏమీ లేదని, కేంద్రానిదే అని చెప్పడానికి స్కిల్ సెంటర్ల పేరు మార్చి మోదీ పేరు జత చేస్తున్నారు. ఈ వ్యవహారం సహజంగానే బీజేపీ వర్గాల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మరే పథకానికి మోదీ పేరు పెట్టకుండా కేవలం స్కిల్ సెంటర్లకే మోదీ ఫోటోతో సహా ఎందుకు బోర్డులు పెడుతున్నార్న అంశం చర్చనీయాంశంగా మారింది .

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -