Visakha: విశాఖకు సీఎం జగన్.. ఏపీ వాసుల రాజధాని కలలు నెరవేరేది అప్పుడేనా?

Visakha: విశాఖకు సీఎం జగన్‌కి మధ్య ఒక తెలియని ప్రేమానుబంధం సంగతి తెలిసిందే. జగన్ కూడా విశాఖ అంటే జగన్ కి ఇష్టం. సిటీ ఆఫ్ డెస్టినీ ని రాజధానిగా చేసుకొని పాలించాలని జగన్ ఆలోచన. అందుకోసం ఆయన మూడు రాజధానుల పేరుతో చట్టాన్ని చేసి తరువాత ఎందుకో ఉపసంహరించుకున్నారు. అమరావతి రాజధాని వివాదం సుప్రీం కోర్టులో ఉంది. న్యాయ పరమైన ఇబ్బందులకు తావు లేకుండా ఉండాలీ అంటే మరో తరుణోపాయం ఉంది. దాన్ని ఇపుడు వైసీపీ అమలు చేయబోతోంది. జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖకు మార్చడాన్ని టెక్నికల్ గా ఎవరూ తప్పుపట్టలేరు. అది చెల్లుతుంది.

అందుకే ఆ దిశగా వైసీపీ ఆలోచనలు వేగంగా కదులుతున్నాయి. అదే విషయాన్ని మంత్రి గుడివాడ అమరనాధ్ వెల్లడించారు. జగన్ విశాఖకు దసరా నాటికి రాబోతున్నారని ఆయన పార్టీ మీటింగులో సంచలన ప్రకటన చేశారు. విశాఖ వాసుల కోరిక ఆ విధంగా నెరవేరబోతోంది అని మంత్రి అంటున్నారు. జగన్ విశాఖకు రావడం పక్కా అని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. జగన్ విశాఖకు దసరాకు రావడం ద్వారా పాలనను స్మార్ట్ సిటీకి తేబోతున్నారు అని అంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ తరలివచ్చిందంటే పాలన పూర్తిగా విశాఖకు బదిలీ అయినట్లే అని అంటున్నారు.

 

విశాఖ రాజధాని అని హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రి విశాఖకు వస్తున్నారు అని వైసీపీ మంత్రులు కీలక నేతలు చెబుతున్నారు. ఈసారి దసరా పక్కా అని అంటున్నారు. ఇప్పటికి చూస్తే రెండు నెలల సమయం ఉంది. అంటే జగన్ విశాఖ మకాం కి ఈ అరవై రోజులలో వ్వవధికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -