CM Jagan: ద‌గ్గ‌రి వాళ్ల‌ను కూడా దూరం చేసుకుంటున్న సీఎం జగన్.. 2024లో షాకింగ్ ఫలితాలు తప్పవా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో మాత్రం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలలో తమ పార్టీ జెండా ఎగురుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఈయన తన మంత్రులు ఎమ్మెల్యేలను గడపగడపకు వెళ్లి ప్రజలలో ఉండాలి అంటూ ఆదేశాలను జారీ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఇతర పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలలోకి వస్తూ తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పథకాల విడుదల కార్యక్రమాలలో తప్ప మిగతా సందర్భాలలో ప్రజలలోకి రావడం లేదు. అదేవిధంగా ఈయనకు వ్యతిరేకవర్గాలు కూడా బలపడుతున్నాయి. మరోవైపు తన అనుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమవుతున్నారు.

 

గత ఎన్నికలలో తన విజయానికి ఎంతో దోహదపడినటువంటి షర్మిల,విజయమ్మ ఇద్దరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అదే విధంగా పార్టీలో కొంతమంది నేతలను కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నారు. ఇలా తన అన్న వాళ్ళందరిని ఈయన దూరం పెడుతున్నటువంటి తరుణంలో తనకు ఈ ప్రభావం చూపబోతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా చిరంజీవి మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యా రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు మరోవైపు బిజెపి రాష్ట్ర అధినేతగా పురందేశ్వరి ఎన్నికైన తర్వాత ఈమె తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడుతున్నారు. ఈ విధంగా జగన్ కు వ్యతిరేక పార్టీలన్నీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో ఈయన తన వాళ్లకు దూరమవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలపై ఈ ప్రభావం తప్పకుండా పడబోతుందని తెలుస్తుంది మరి జగన్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -