CM Jagan: 22 మంది ఎంపీ లను మర్చనున్న సీఎం జగన్….!

CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ లో అభ్యర్థుల మార్పు హాట్ టాపిక్ గా మారుతోంది.నూతన జాబితాల పేరుతో సీఎం జగన్ పాత అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు ఎమ్మెల్యే లా వంతు అయితే …ఇప్పుడు ఎంపీ లా వంతు వచ్చింది. ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మొత్తం 22 మంది ఎంపీలు గెలిచారు. 25 ఎంపీ సీట్లు ఉంటే మూడంటే మూడు తప్ప మిగిలిన వాటిని వైసీపీ సొంతం చేసుకుని సంచలన విజయం సాధించారు.ఇంత పెద్ద నంబర్ తో ఎంపీ సీట్లు గెలుచుకున్నందువల్లనే వైసీపీకి కేంద్రం వద్ద మంచి పలుకుబడిని సంపాదించింది.

 

కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కనీస విలువ గౌరవం ఇస్తోంది అంటే వైసీపీకి ఉన్న అతి పెద్ద ఎంపీల నంబరే కారణం అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఏపీలో 22 మంది ఎంపీలు వైసీపీకి ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ అదే మొత్తంలో గెలవాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. దానికోసం పెద్ద ఎత్తున మార్పులు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలను పిలిపి మాట్లాడు సీట్లు ఇచ్చే విషయం పైన ఒక నిర్ణయం వారికి చెప్పేశారు. ఇందులో చాలామంది ఎంపీలకు జగన్ మొండి చేయి చూపించారని వినిపిస్తుంది.

విజయమే లక్ష్యంగా జగన్ నిర్ణయం ఉన్నట్టు తెలుస్తుంది.దాని కోసం వైసీపీ పెద్ద ఎత్తున మార్పు చేర్పులు చేస్తోంది. ఈసారి మొత్తం ఎంపీలను చేంజ్ చేసేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది. వన్ అండ్ ఓన్లీగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఉంటారు తప్ప మిగిలిన వారు అంతా మారిపోతారు అనే అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉంటుంది అంటున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. అక్కడ ఎంపీ స్థానంలో కొత్తవారు వస్తున్నారు. అలాగే హిందూపురం నుంచి కర్నాటక బీజేపీ మాజీ ఎంపీ జె శాంతమ్మకు టికెట్ ఇస్తున్నారు. ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ కి నో చెప్పేశారు.

 

కడప నుంచి చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డిని కాదని చెప్పి జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఎంపీగా మైనారిటీ వర్గానికి చెందిన నేతకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ప్లేస్ లో మంత్రి గుమ్మలూరి జయరాం కి చాన్స్ ఇస్తున్నారు. నంద్యాల ఎంపీ సీటు కూడా మారుస్తారు అని అంటున్నారు. ఇక చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తిలకి కూడా ఈసారి ఎన్నికల్లో చాన్స్ ఉండదని అంటున్నారు.

 

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యే గా పోటీకి నిలబెడుతున్నారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్లేస్ లో వైవీ సుబ్బారెడ్డికి చాన్స్ ఇస్తున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని మారుస్తారు అని టాక్ ఉంది. అలాగే నర్సారావుపేట ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయలుని గుంటూరు ఎంపీగా పోటీ చేయమంటున్నారు. విజయవాడ ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీవీ పార్టీకి దూరం అయ్యారు.టిడిపి నుండి జంప్ అయిన విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ వైసీపీ ఇస్తోంది. మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరీని ఏలూరు ఎంపీగా పంపిద్దామని చూస్తున్నారు. అక్కడ కొత్త ముఖానికి చోటిస్తారు అంటున్నారు. అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈసారి పోటీ చేయట్లేదు.

 

అమలాపురం నుంచి ఎంపీగా ఉన్న చింతా అనూరాధకు పి.గన్నవరం ఎమ్మెల్యేగా చాన్స్ ఇస్తారని అంటున్నారు. అక్కడ కొత్తవారికి ఎంపీ చాన్స్ ఇస్తారని అంటున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. కాకినాడ ఎంపీ టికెట్ ని ముద్రగడ కుటుంబానికి కానీ చలమలశెట్టి సునీల్ కి కానీ ఇస్తారని అంటున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ని రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యే గా పోటీకి రెడీ చేస్తున్నారు. అక్కడ ఎంపీ సీటుని బీసీ అభ్యర్థికి ఇస్తారని అంటున్నారు. నర్సాపురం ఎంపీ సీటులో రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఉన్నారు. ఆ సీటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబానికి ఇస్తారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా విషయానికి వస్తే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. ఎంపీ సీటుని బొత్స సతీమణి బొత్స ఝాన్సీరాణికి ఇస్తున్నారు. అనకాపల్లి ఎంపీగా ప్రస్తుతం ఉన్న భీశెట్టి సత్యవతి ప్లేస్ లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పోటీ చేయిస్తున్నారు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

 

అరకు ఎంపీ సీటు నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. అరకు ఎంపీగా పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మిని పోటీకి రెడీ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ టికెట్ ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఇస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ టికెట్ మీద పోటీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.మొత్తానికి వైసీపీ లో ఎంపీలా మార్పు భారీ స్థాయిలో ఉంటుంది అని అర్దం అవుతుంది.జగన్ అంచనాలకు తగ్గట్టు ఈసారి కూడా అదే స్థాయిలో ఎంపీలు గెలుస్తారో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -