Jagan: వాళ్ల మనస్సు గెలుచుకున్న సీఎం జగన్.. సీఎం కావడం గ్యారంటీ?

Jagan: ఆంధ్రప్రదేశ్ లో 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ పథకాలే ప్రధాన ఏజెండాగా ప్రజల్లో వెళ్తున్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో సంక్షేమమే పరమాదిగా పనిచేశామని చెబుతున్నారు. 96 శాతం ఇళ్లకు రాష్ట్రంలో వివిధ రకాల పథకాలను అందించామని జగన్ వెల్లడించారు. అయితే మరీ ఇలానే పథకాలు కొనసాగాలంటే నెక్ట్స్ ఎవర్ని ప్రజలు గెలిపించుకోవాలి?.

నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పథకాలు అందిస్తోంది. అందులో ముఖ్యమైన అమ్మఒడి, ఆసరా, ఈబీసీ నేస్తం, ఫించన్లు ఇలా పలురకాల పథకాలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే మెజారిటీ ప్రజలకు ఈ పథకాల్ని వివిధ రూపాల్లో అందుతున్నాయి. ప్రజలు ఈ పథకాలకు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. తమకి జగన్ అడక్కుండానే డబ్బులు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

కరోనా కష్టకాలంలో జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నంగా ఉంది. కరోనా వల్ల మరింత చితికిపోయింది. అయినప్పటికీ జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థితిలోనూ తమకి డబ్బు వేస్తున్నాడని అభినందిస్తున్నారు. మరోవైపు ఆసరా ఫించన్లు కూడా 2750 చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతం వేయటం లేదు. ఇందుకో కొంత వాస్తవం ఉంది. జీతం వేస్తున్నారు, కానీ కొద్దిగా లేట్ అవుతోంది. ప్రభుత్వం సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నట్లు ఇలా జరగటంలో తప్పేలేదని కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల కన్నా, పేదలే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు కూడా ఉద్యోగులపై ఎక్కడా పాజిటివ్ వైబ్ తో లేరు. దీంతో మరోసారి జగన్ కే ప్రభుత్వ పథకాల లబ్దిదారులు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -