Jagan-Sharmila: ఒక్కటైన జగన్, షర్మిల.. తల్లి విజయలక్ష్మి సమక్షంలోనే.. విబేధాలు లేనట్లేనా?

Jagan-Sharmila: అవును మీరు విన్నది అక్షరాలా నిజం. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన చెల్లి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒక్కటయ్యారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి సాక్షిగా, తల్లి విజయలక్ష్మి సమక్షంలో కలిసిపోయారు. అంతేకాదు ఇద్దరు కలిసి పక్కపక్కనే కూర్చునున్నారు. అన్నాచెల్లెలు కాసేపు మాట్లాడుకున్నారు. గత కొంతకాలంగా వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు నెలకొన్నాయని, షర్మిల కొత్త పార్టీ, వైఎస్ విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయడం వైసీపీలో ప్రకంపనలు రేపింది. జగన్ పాలనను విమర్శిస్తూ షర్మిల వ్యాఖ్యలు చేయడం, వైసీపీని వదిలేసిన షర్మిల పార్టీకి విజయమ్మ మద్దతు తెలపడం కలకలం రేపుతోంది.

ఈ క్రమంలో జగన్, షర్మిల కలిసి మాట్లాడుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇవాళ వైఎస్సార్ వర్దంతి సందర్భంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. సీఎం వైఎస్ జగన్ తో పాటు అయన సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, విజయలక్ష్మి వైఎస్సార్ కు నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

అయితే వైఎస్ సమాధి వద్ద జగన్, షర్మిల పక్కపక్కనే కూర్చున్నారు. ఒకరినొకరు పలకరంచుకున్నారు. దీంతో జగన్, షర్మిల ఒక్కటయ్యారని అందరూ ముచ్చటించుకుంటున్నారు. వైసీపీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నుంచి షర్మిల బయటకి వచ్చి తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు కూడా గుప్పించారు. జగన్, షర్మిల మధ్య విబేధాలతోనే అన్న పార్టీని కాదని షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేసిందనే ప్రచారం సాగుతోంది.

ఇక వైఎస్ విజయమ్మ కూడా కూతురికే మద్దతు ప్రకటించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి షర్మిల పార్టీకి అండగా ఉంటున్నారు. కొడుకు సీఎం అయ్యాడని, కూతురిని తాను అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో విజయలక్ష్మి, షర్మిలని జగన్ పార్టీ నుంచి బయటకు పంపించారనే ఆరోపణలు వచ్చాయి. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కు కూడా ఇష్టం లేదు. దీంతో షర్మిలతో మాట్లాడం మానేశారు.

గతంలో వైఎస్సార్ జయంతి, వర్దంతి సందర్భాలలో ఇడుపులపాయలోని సమాధి వద్దకు కూడా జగన్ వెళ్లిన తర్వాత షర్మిల.. లేదా షర్మిల వెళ్లిన తర్వాత జగన్ వచ్చి నివాళులు అర్పించేవారు. వైఎస్సార్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు హాజరవుతున్నా.. ఇద్దరి మధ్య మాటలు అసలు లేవు. ఇలాంటి తరుణంలో ఇవాళ వర్దంతి కార్యక్రమంలో జగన్, షర్మిల మాట్లాుకోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు తొలగిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మరికొంతమంది మాత్రం జగన్, షర్మిల మధ్య అభిప్రాయ బేధాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. మాట్లుడుకోలేనంత స్థాయిలో విబేధాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరూ పక్కపక్కన కూర్చోని మాట్లాడుకోవడంతో విబేధాలు లేవన్నట్లే అర్థం చేసుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -