Jagan Delhi Tour: ఢిల్లీ చుట్టూ సీఎం జగన్ ప్రదక్షిణలు.. అసలు కారణాలు ఇవేనా?

Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లారు ఉదయం ఈయన ఢిల్లీ బయలుదేరారు. ఇక మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అలాగే పలువురు బిజెపి నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఇలా జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లడంతో ఈయన పర్యటనపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

గత కొద్దిరోజుల క్రితం బిజెపి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అలాగే జే పీ నడ్డా తెలంగాణలో పర్యటించడమే కాకుండా జగన్ ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేశారు. ఇలా బిజెపి మంత్రులు వచ్చి వెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లడంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పట్ల ఆసక్తి నెలకొంది.

 

మ‌రోవైపు అమిత్ షా- చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికే పొత్తుల‌పై చర్చ‌లు జ‌రిపారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలకు దారితీసినప్పటికీ, ఈ విషయంలో అంతకుమించి ఎలాంటి చ‌ర్చ‌ జరగలేదు.  పొత్తు విషయం గురించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు మౌనం వహిస్తున్నారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం పొత్తు గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

 

ఇకపోతే జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటన వెళ్లడానికి మరో కారణం ఉందని పలువురు భావిస్తున్నారు. బహుశా ఈయన రాష్ట్రానికి మరి కొంత నిధులు ఇవ్వమని అడగడానికి వెళ్లారా లేకపోతే వైయస్ వివేక హత్య కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ ను కాపాడటానికి ఢిల్లీ వెళ్లారా అంటూ ప్రతిపక్ష నేతలు ఈయన ఢిల్లీ పర్యటనపై విమర్శలు కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -