CM Jagan: వైరల్ అవుతున్న సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!

CM Jagan: ఏపీలో కుల రాజకీయాలు, ప్రభుత్వ పథకాలతో నడిచే రాజకీయాలే ఎక్కువ. అందుకే ప్రధాన పార్టీలన్నీ వాటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇది ఇప్పటది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలానే నడుస్తున్నాయి. అయితే తెలంగాణతో పోల్చితే కుల రాజకీయాలు ఏపీలో ఎక్కువే. ఇక ఇక్కడ ప్రజలు తాయిలాలకి ఊరికే పడిపోతారు. అందుకే సీఎం జగన్ తాజాగా సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే అంతే సంగతని ఆయన్ను నమ్మోద్దని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. బాబు సర్కార్ వస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్నారు. శుక్రవారంనాడు నెల్లూరు జిల్లాలోని కావలిలో చుక్కల భూములపై నిషేధం ఎత్తివేస్తూ రైతులకు హక్కు పత్రాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తున్నారని జగన్ విమర్శించారు.

 

ప్యాకేజీ తీసుకున్న ప్యాకేజీ స్టార్ బాబు వైపున నిలబడ్డారని సీఎం జగన్ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరి డ్రామా వాళ్లు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు పర్యటిస్తున్నారనే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. వీళ్లు వచ్చినా, రాకున్నా ఈ నాలుగేళ్లు ఎవరు కొన్నారని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రైతు బాంధవుల వేషాలు వేసుకున్నారన్నారు.

 

రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. జీవీరావు అనే వ్యక్తి ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. జీవీరావు చార్టెడ్ అకౌంటెంట్ సర్వీస్ రద్దైందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇలాంటి దానయ్కకు కోటు తొడిగి ఆర్ధిక నిపుణుడిగా చూపించారన్నారు.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వద్దని దివాళా తీస్తుందని చెప్పిస్తున్నారని జగన్ విమర్శించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -