CM Jagan: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఈ మధ్యకాలంలో ఏపీ సీఎం జగన్ మాటలు ఆ పార్టీ నేతలను ఆలోచనలోకి నెట్టేస్తున్నాయి. ఎందుకంటె జగన్ రాను రాను ప్రసంగాల్లో తన బేలతనాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే పలు సార్లు అలా చేసిన జగన్ తాజాగా కూడా బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన ఆయన మాటలు అలాగే ఉన్నాయి. మంచిచేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ. ఎన్నికల్లో గెలవడమే కష్టమంటున్నారని ఏడుపు మొహం పెట్టుకుని దీనంగా వ్యాఖ్యానించారు మీ బిడ్డ పాలనలో మీకు జరిగిఉంటే మీరే సైనికులుగా తోడుగా నిలవాలి అంటూ ప్రాధేయపడ్డారు.

జగన్ మోహన్ పెడ్డి ఈ మాటలు ప్రసంగం చివరిలో అనడంతో ఒకప్పుడు ఆయన ప్రసంగాలను ఇప్పటి ప్రసంగాలను చూసి.. ఇదేం మార్పు అనుకుంటున్నారు వైసీపీ నేతలు. అప్పట్లో వైఎస్ లాగానే పోర్టుకు భూమిపూజ ఇక దశ తిరిగిపోయిందని కథలు చెప్పడానికి జగన్ చాలా సమయం కేటాయించారు. వైఎస్ పదిహేనేళ్ల కింద చేసిన శంకుస్థాపనకే దిక్కులేనప్పుడు మళ్లీ పదిహేనేళ్ల తర్వాడ కొడుకు మళ్లీ శంకుస్థాపన చేస్తే ఎవరు నమ్ముతారని అనుకోలేదు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం ఇష్టారీతిన చెలరేగిపోయారు. పోర్టు రాకూడదని అనుకున్నారని ఆరోపించారు. ఇరవై నాలుగు నెలల్లో పెద్ద పెద్ద ఓడలు వస్తాయని జగన్ గాల్లో మేడలు కట్టారు.

 

అమరావతి స్థలాల గురంచి కూడా జగన్ గొప్పగా చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో కూడా ఇలా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకుంటే అడ్డుపడుతున్నారన్నారు. అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్‌ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారని.. కానీ తాను పేదలకు ఇళ్లు ఇస్తున్నాని చెప్పుకొచ్చారు. 26న అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వయంగా చేస్తున్నానని ప్రకటించుకన్నారు. అలాగే ప్రతి పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే చంద్రబాబు స్మశానంతో పోలుస్తున్నారు అంటూ మండిపడ్డారు జగన్. అసలు అమరావతిని స్మశానంగా పోల్చింది వైసీపీ మంత్రులే అన్న సంగతిని జగన్ మర్చిపోయారు. ఆయన ఈ విమర్శలు చేస్తున్నప్పుడు ప్రజల్లో స్పందన లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -