CM KCR: హామీల విషయంలో జగన్ ను కాపీ కొట్టిన కేసీఆర్.. ఇంతకంటే సాక్ష్యం అవసరమా?

CM KCR: తెలంగాణలో మరొక నెలన్నర వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బిఆర్ యస్ కాంగ్రెస్ బిజెపి నేతలు ప్రజలలోకి వెళ్తూ ప్రజలకు వరాల జల్లుల కురిపిస్తున్నారు. ఇక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థి ఎంపిక అయ్యారు అనే విషయాలను కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్నికలలో ప్రజలను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలలో గెలుపొందడం కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటించారు. అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి కాపీ కొట్టారని ఆయన అనుసరిస్తున్న విధంగానే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అందించబోతున్నారని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆసరా పింఛన్ 5వేలకు పెంచబోతున్నారు అలాగే సౌభాగ్య లక్ష్మి కింద మూడు వేల రూపాయల ఇవ్వబోతున్నారు.

ఇక పక్క ఇల్లను కూడా అందించబోతున్నారు. ఐదు లక్షల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించబోతుంది. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించబోతున్నారు. అలాగే అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేకంగా గురుకులాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా తాజాగా కేసీఆర్ విడుదల చేసినటువంటి జగన్ ప్రస్తుతం ఏపీలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసే ఈయన కూడా మేనిఫెస్టో విడుదల చేశారని తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్లో కూడా 250 రూపాయలు చొప్పున ప్రతి ఏడాది పెన్షన్ పెంచుతూ 3000 రూపాయలకు తీసుకురాబోతున్నట్లు జగన్ ప్రకటించారు. అలాగే రేషన్ లో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించబోతున్నారు అలాగే జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాల ఫార్మాట్ ను కూడా కేసీఆర్ కాపీ కొట్టారు. ఇక, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు పోటీ ఇచ్చేలా మేనిఫెస్టోలో కొన్ని అంశాలున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి ఈ పథకాలన్నీ ఆశామాషి అయినవి కాదని దేశంలోనే ఎంతో గర్వించదగ్గ పథకాలు అంటూ ఈ సందర్భంగా కెసిఆర్ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -