CM KCR: ఉత్తరాదిపై సీఎం కేసీఆర్ ఫోకస్.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బిగ్ స్కెచ్

CM KCR: రాష్ట్ర రాజకీయాలు, మునుడోగు ఉపఎన్నికలపై ఫోకస్ పెడుతూ.. మరోవైపు జాతీయ రాజకీయాలపై కూడా సీఎం కేసీఆర్ మళ్లీ గురి పెట్టారు. జాతీయ రాజకీయాల్లో మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ జాతీయ రాజకీయాలు కాస్త స్లోగానే సాగాయి. అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి సీఎంలను కలుస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ, ఉత్తరప్రదేశ్ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు.

ఇక ఇటీవల బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్ ను కలిశారు. ఇలా నేతలందరినీ అప్పుడప్పుడు కులుస్తూ ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ఏకంగా ప్రజాక్షేత్రంలోకి దిగాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఉత్తరప్రదేశ్ లో భారీ బహిరంగ సభకు కసరత్తులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో దళితులతో కలిసి బహిరంగ సభ నిర్వహించాలని చూస్తున్నారు. జాతీయ దళిత సంఘాలతో త్వరలో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. వారితో చర్చించి యూపీలో జాతీయ స్థాయి సభ నిర్వహించాలని భావిస్తున్నారు.

ప్రగతిభవన్ లో ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతో కేసీఆర్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి యూపీకి చెందిన రైతు సంఘాలు కూడా వచ్చాయి. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు పథకం బాగుందంటూ యూపీకి చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసలు కురిపించారు. దీంతో యూపీలో దళితబంధు పథకం గురించి తెలియజేయడంతో పాటు మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దళితులతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దళిత సంఘాల నేతలతో చర్చించిన తర్వాత ఈ సమావేశం నిర్వహించనున్నారు.

ఇటీవల తెలంగాణలో భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కూడా దీనిపై నేతలతో కేసీఆర్ చర్చించారు. యపీలో బహిరంగ సభపై నేతలతో చర్చించారు.యూపీలో నిర్వహించే సమావేశానికి బీజేపీయేతర నాయకులందరినీ ఆహ్వానించాలని చూస్తున్నారు. ఎన్డీయే వ్యతిరేక పార్టీలన్నింటికీ ఆహ్వానాలు పంపాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ బహిరంగ సభపై చర్చించేందుకు యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కేసీఆర్ మరోసారి కలవనున్నారు.

ఇక యూపీలో దళితుల సభ ముగిసిన తర్వాత మహారాష్ట్రలో సభకు ప్లాన్ చేసే అవకశముంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో రైతులతో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. దాదాపు లక్ష మంది రైతులతో ఈ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలోని రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్ల గురించి ఈ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా రావాలని బహిరంగ సభ ద్వారా చెప్పనున్నారు. మోదీ తీసుకుంటునన రైతు వ్యతిరేక నిర్ణయాలను సభలో ప్రసంగించనున్నారు.

ఆ తర్వాత గుజరాత్ తో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశముంది. గుజరాత్ తో కూడా రైతులతోనే బహిరంగ సభ జరపనున్నారు. రైతుల ఎజెండాగానే కేసీఆర్ జాతీయ రాజీకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. రైతు సమస్యలను ఎజెండాగా తీసుకుని జాతీయ రాజకీయాల్లోకి క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాదిలో బీజేపీకి వ్యతిరేకంగా రతులు ఉన్నారు. దీంతో దీనిని క్యాష్ చేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాదిలో బహిరంగ సభలు నిర్వించిన తర్వాత కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత రాష్ట్ర బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి కేసీఆర్ పూర్తిగా నేషనల్ పాలిటిక్స్ కు పరిమితమయ్యే అవకాశముంది. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి అని ప్రచారం జరిగినా.. రైతు రాష్ట్ర సమతిగా నామకరణం చేసే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -