CM KCR: చంద్రబాబును ఫాలో కానున్న కేసీఆర్.. త్వరలో సంచలన డెసిషన్?

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నారనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు గత టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తీసుకోనున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు బాటలో కేసీఆర్ నడవనున్నారని, టీడీపీ అధినేతను ఫాలో కానున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో ఖచ్చితంగా త్వరలో కేసీఆర్ కేంద్రానికి చెక్ పెట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో దూకుడు మీద ఉన్న బీజేపీకి ఆ నిర్ణయంతో షాక్ ఇవ్వనున్నారనే చర్చ నడుస్తోంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం

దేశంలో ప్రతిపక్షాలపై సీబీఐని ఓ అస్త్రంగా మోదీ సర్కార్ వాడుతున్న విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారిపై సీబీఐను ప్రయోగిస్తోంది. అధికార ప్రభుత్వాలను పడగొట్టేందుకు, అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు సీబీఐని ఓ బ్రహ్మాస్తంగా వాడుకుంటోంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో తనను టీడీపీ నేతలపై ఐటీ దాడులతో పాటు సీబీఐని ప్రయోగించే అవకాశముందని చంద్రబాబు భావించి ముందే చెక్ పెట్టారు. రాష్ట్రంలో సీబీఐ అధికారులు అడుగుపెట్టాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఎవరిపైన అయినా దాడులు చేయాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై అప్పట్లో పెద్ద వివాదం చెలరేగింది. ప్రతిపక్ష వైసీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు భయపడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. అందుకే ముందుగా సీబీఐ అనుమతి తీసుకోవాలంటూ ఆదేశాలు చ్చారంటూ బాబుపై దమ్మెత్తిపోశారు.

అప్పటికే పశ్చిమబెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ కూడా సీబీఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. మమతా తీసుకున్న తర్వాతనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా టీఆర్ఎస్‌ను ఇరుకున పట్టేందుకు ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి చెందిన సన్నిహితులపై ఐటీ దాడులు మొదలుపెట్టింది. ఇక కేసీఆర్ కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే కవితపై సీబీఐ కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణలో కూడా సీబీఐపై కేసీఆర్ ఆంక్షలు విధించే అవకాశముంది.

సీబీఐ అధికారులు ఎవరిపైన అయినా దాడులు చేపట్టాలన్నా.. విచారణ చేయాలన్నా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందిగా త్వరలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. మోదీ సర్కార్ తన కూతురు కవితపై సీబీఐ కేసు పెట్టే అవకాశముందనే వార్తల నేపథ్యంలో త్వరలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. బుధవారం బీహార్ పర్యనటకు వెళ్లిన కేసీఆర్.. నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. బీహార్ లోకి సీబీఐను అనుమతించకుండా ముందుగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం మంచిదన్నారు.

దేశంలోని ప్రతి రాష్ట్రం ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని, సీబీఐ లాంటి సంస్థలు రాష్ట్రంలోకి చొరబడి ఇష్టమొచ్చినట్లు దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులతో పాటు ఆర్జేడీ నేతలపై సీబీఐ దాడులు చేపట్టింది. దీంతో బీహార్ ప్రభుత్వం ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. దీంతో బీహార్ లో కేసీఆర్ చేసిన కామెంట్స్ తో తెలంగాణలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకోనున్నారా అనే చర్చ జరుగుతోంది

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -