CM Ys Jagan – Chandrababu: నోవాటెల్ లో టెన్షన్.. జగన్, చంద్రబాబు ఎదురుపడితే?

CM Ys Jagan – Chandrababu: ఏపీలో రాజకీయంగా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఏర్పడిన రాజకీయ వైరం.. ఆ తర్వాత తండ్రి మరణంతో జగన్ తో మొదలైంది. జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు ఎంత తీవ్రంగా విమర్శలు చేసుకుంటారో తెలిసిందే. ఒక్కొక్కసారి రాజకీయం దాటి వ్యక్తిగతంగా కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కుటుంబాలపై కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్న సందర్భంగాలు ఉన్నాయి.

ఇక వైసీపీ నేతలు చంద్రబాబుపై రోజూ విమర్శలతో విరుచుకుపడటం, దానికి తెలుగు తమ్ముళ్లు కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉంటాయి. అయితే రాజకీయ వైరం వల్ల చంద్రబాబు, జగన్ అసలు ఎదురుపడరు. ఇద్దరూ ఎదురుపడి ఒకకరి మొఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. అసెంబ్లీ సమావేశాల్లో ఒకరినొకరు చూసుకునేవారు. అయితే తన భార్యతో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో జగన్ పాలనలో అసెంబ్లీలో తాను అడుగుపెట్టనంటూ చంద్రబాబు సంచలన శపథం చేశారు. దీంతో అప్పటినుంచి అసెంబ్లీలో కూడా ఇద్దరు ఎదురుపడటం లేదు.

అయితే ఇటీవల స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో అయినా జగన్, చంద్రబాబు ఎదురుపడతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇద్దరు పక్కపక్కనే ఉన్నా.. ఒకరి మొఖం కూడా ఒకరు చూసుకోలేదు. ఎడమొఖం, పెడమొఖంగానే ఇద్దరూ వ్యవహరించారు. బయట రాజకీయాలు ఎలా ఉన్నా.. గవర్నర్ సమక్షంలో ఇద్దరు ఎదురుపడతారేమోనని అంటరూ ఊహించారు. అదేమీ జరగలేదు.

తాజాగా విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కూడా ఇద్దరూ ఎదురిపడినంత పని అయింది. కోర్టు భవనాలను ప్రారంభించేందుకు సీజేఐ ఎన్వీ రమణ విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్ లో బస చేశారు. ఉదయం ఎయిర్ పోర్ట్ లో దిగిన అనంతరం టిఫిన్ చేసేందుకు నోవాటెల్ హోటల్ కు వచ్చారు. దీంతో ఎన్వీ రమణను కలిసేందుకు జగన్, చంద్రబాబులు ఒకే టైమ లో వచ్చారు. దీంతో కాసేపు టెన్షన్ నెలకొంది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి జగన్, చంద్రబాబును వేరే వేరే దారుల నుంచి లోపలికి పంపించారు.

ముందుగా సీఎం జగన్ వెళ్లి ఎన్వీ రమణను కలిశారు. జగన్ వెళ్లిపోకముందే చంద్రబాబు నోవాటెల్ కు వచచ్ారు. దీంతో జగన్ ను సెల్లార్ మార్గం ద్వారా పంపించగా.. చంద్రబాబును హోటల్ ప్రధాన ద్వారం పోర్టుకో ద్వారా ఎన్వీ రమణను కలవడానికి పంపించారు. కలిసిన తర్వాత మళ్లీ ఆవే మార్గాల ద్వారా ఇద్దరిని పంపించారు. దీంతో జగన్, చంద్రబాబు ఎదురుపడతారేమోనని అనుకున్నారు. పోలీసులు వర్గాల్లో కూడా కాసేపు టెన్షన్ నెలకొంది. చివరికి ఇలా సమయస్పూర్తితో పోలీసులు వ్యవహరించడతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -