CM Jagan: జగన్ గొప్పదనం తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఇన్ని హామీలు అమలు చేసిన సీఎం లేడంటూ?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అభివృద్ధి మాట పక్కన పెడితే స్కూల్ పిల్లల నుంచి ఆటో డ్రైవర్ల వరకు ప్రతి ఒక్కరికి కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు పేద కులాలు నిరుపేదలు, కుటుంబాలు పిల్లలు పెద్దలు మహిళలు అందరూ బాగుండాలి అన్న సంకల్పంతో నవరత్నాల పాలన ప్రారంభించి అందించారు. అందులో భాగంగానే 53 నెలల్లో ఒక సామాజిక సాధికారత విప్లవాన్ని జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆవిష్కరించడం జరిగింది.

ఈ సమయంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు జగన్ ప్రభుత్వం రూ. 2.38 లక్షల కోట్ల డిబిటి మరో రూ.2.35 లక్షల కోట్ల నాన్ డీబీటీ. అంతేకాకుండా జగన్ ప్రవేశపెట్టిన పథకాలను బటన్ నొక్కితే నేరుగా వారి ఖాతాల్లోకి వచ్చి పడుతోంది. ఒకటి రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఏ సీఎం కూడా చేయలేని విధంగా ఎన్నో హామీలు అమలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి మాటకు ముందు నా అనే మాటకు అర్థం చెబుతూ రూ. 2.38 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతా లోకి నేరుగా జమ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో రూ.2.38 లక్షల కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అన్న విషయాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి.

జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ద్వారా నేడు పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. 53 నెలల కాలంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరుగని విధంగా సువర్ణాక్షాలతో లిఖించే విధంగా రాష్ట్రం గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామస్థాయిలోనే అవినీతికి ఏ మాత్రం తాగులేకుండా లంచాలకు వివక్షకు చోటు లేకుండా పౌర సేవల డెలివరీ డీబీటీ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని గొప్ప విప్లవాత్మక మార్పులు చేశారు. ఈ 53 నెలల వ్యవధి కాలంలో జగన్ ఏం చేశాడు అన్నది ఏ పేదవాడి గడపలో అడిగినా కూడా చిక్కటి చిరునవ్వులతో అర్థమయ్యేలా చెబుతాడు. అలాగే మేనిఫెస్టో అంతే చెత్త బుట్టలో పడేసే ప్రణాళిక కాదు.

మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అనే కొత్త అర్థం చెప్పు 99% వాగ్దానాలను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. అంతే కాకుండా నేడు రాష్ట్రంలో 87% ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు లేకుండా వివక్ష లేకుండా ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుతున్నారు. అలాగే గడప వద్దకే అన్ని రకాల వాలంటరీ సేవలను కూడా తీసుకోవచ్చారు. పింఛన్ రేషన్ అలాగే ఇంటి వద్దకే బర్త్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు గడపకే వచ్చి ఇస్తున్న పాలన మనకు నేడు కనిపిస్తోంది. నేను లంచాలు లేని వ్యవస్థ మనకు గ్రామంలోనే కళ్ళముందే కనిపిస్తోంది.

ఇక విద్యారంగంలో జగన్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అభివృద్ధి గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. అమ్మ దీవెన అంటూ 10000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బై జ్యూస్ కంటెంట్ బై లింగువల్ టెక్స్ట్ బుక్స్, ఇలా ఎన్నెన్నో సదుపాయాలను సౌకర్యాలను కల్పించారు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లలో 2.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తూ కొన్ని లక్షల ఇండ్ల నిర్మాణాలను వేగంగా చేపడుతున్నారు. ఈ విధంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ సీఎం కూడా అందుబాటులోకి తీసుకురాని హామీలను తీసుకురావడంతో పాటు ఆ హామీలను నెరవేర్చి చూపించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -