Gudivada Amarnath: ఆ బాధ్యతల నుంచి గుడివాడను తప్పించిన జగన్.. ఏమైందంటే?

Gudivada Amarnath: మరొక నెలన్నర వ్యవధిలోగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి నుంచి కాస్త చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వడం లేదని జగన్మోహన్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు. మరికొందరు ఎమ్మెల్యేలు ఎంపీలను స్థాన మార్పిడి కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి గుడివాడ అమర్నాథ్ కి జగన్మోహన్ రెడ్డి ఇటీవల వరుస షాకులు ఇస్తున్నారు.

అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి నియోజకవర్గం బాధ్యుడిగా మరొకరిని నియమించిన సంగతి తెలిసిందే. ఇలా అనకాపల్లికి వేరే వ్యక్తులను నియమించగా మరి అమర్నాథ్ ను ఎక్కడ నియమించబోతున్నారు అనే విషయం గురించి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు ఇలా ఈ విషయం గురించి అమర్నాథ్ ఆందోళనలో ఉన్నారని తెలుస్తుంది.

ఇలా ఇప్పటివరకు టికెట్ కన్ఫర్మ్ చేయకుండా ఉండడమే కాకుండా తాజాగా జగన్మోహన్ రెడ్డి తనకు మరొక షాక్ ఇచ్చారు. ఈయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విశాఖకు కేంద్ర మంత్రులు వీఐపీలు ఎవరు వచ్చిన వారికి స్వాగతం పలికేందుకు అమర్నాథ్ కి అర్హత ఇచ్చారు కానీ నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ రాబోతున్నటువంటి తరుణంలో ఆయనకు స్వాగతం పలికే అవకాశాన్ని కూడా అమర్నాథ్ కి ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ విధంగా ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే అవకాశం ఈసారి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడుకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా తనకు స్వాగతం పలకడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకపోవడంతో అమర్నాథ్ కి జగన్ నుంచి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -