Nara Brahmani-YS Sharmila: షర్మిలతో నారా బ్రాహ్మణికి పోలికా.. నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ?

Nara Brahmani-YS Sharmila:  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతున్నాయి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో టిడిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో నారా లోకేష్ ఇప్పటికే పరారీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఢిల్లీ వెళ్లి పెద్దలతో మాట్లాడి తన తండ్రిని బయటకు తెప్పిస్తానని వెళ్లినటువంటి లోకేష్ ఇప్పటివరకు ఎక్కడ ఒక మీడియా సమావేశంలో పాల్గొనలేదు అలాగే తిరిగి విజయవాడ చేరుకోలేదు దీంతో ఈయన పరారీలో ఉన్నారని పలువురు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే మామయ్య జైలు పాలు కావడం భర్త పరారీలో ఉండడంతో తెలుగుదేశం పార్టీ నేతలకు అండగా నారా బ్రాహ్మిని మాత్రమే దిక్కు అయ్యారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి చాలా క్లిష్టపరంగా ఉంది దీంతో నేతలు అభిమానులు కార్యకర్తలు బంగపాటుకు గురికాకుండా ఉండడం కోసం బ్రాహ్మిని బయటకు వస్తూ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీంతో బ్రాహ్మిని కూడా షర్మిల మాదిరిగానే రాజకీయాలలోకి వచ్చి ఆమెతో పాటు సమానంగానే కొనసాగుతారు అంటూ భావిస్తున్నారు. దీంతో పలువురు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

నారా బ్రాహ్మినికి వైఎస్ షర్మిలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. వైయస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ జగన్ సోదరి. జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు పార్టీని తన చేతుల్లోకి తీసుకొని ఎంతో ధైర్యంగా ముందుకు నడిపించారు. ఇక తన అన్నయ్య ముఖ్యమంత్రి కావడానికి షర్మిల పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి ఈమె ఎలాంటి పరిస్థితులలోనైనా కృంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేసి పార్టీని ముందుకు తీసుకువచ్చారు.

ఇక అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత తనతో వచ్చిన విభేదాల కారణంగా తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో కూడా మొండి రాజకీయం చేశారు. ఎంతైనా రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఇలా రాజకీయాలలో ధైర్యంగా ముందుకు సాగుతుందని అందరూ భావించారు ఇక నారా బ్రాహ్మణి విషయానికి వస్తే తన తాత మామ ఇద్దరు ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఈమె చిన్నప్పటి నుంచి ఒక తండ్రి చాటు బిడ్డగానే పెరిగారు. ప్రస్తుతం తన మామయ్య అరెస్టు కావడంతో ఈమె తప్పనిసరి పరిస్థితులలో బయటకు వచ్చారే తప్ప రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదని ఇలాంటి వ్యక్తిని వైయస్ షర్మిలతో పోల్చడం సరికాదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -