ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ లేదా.. ఆ పార్టీ చరిత్ర ముగిసినట్టేనా?

ఏపీలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ప్రస్తుతం ఇదే మాట రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది వరకు జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ అనే ట్యాగ్ వినిపించేది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆ వెన్నెల రోజులు ముగిశాయని అనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్య రోజులను చూస్తోంది. ఇంకా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఇంకొన్ని చోట్ల ఉనికి కూడాలేదు. ఏపీను తమ రాజకీయ ప్రయోజనాలకోసం విడగొట్టిన కాంగ్రెసును సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేసారు.

సమీప భవిషత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేసారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎగిరెగిరిపడిన నాయకులంతా 2019 ఎన్నికల్లో మట్టికరిచారు. నాయకుల మెడలోని కండువా దిగాలుగా నేలరాలింది. దీనికితోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడా పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పేరు తలుచుకోవడానికి కూడా ఆ పార్టీ నేతలు ఇష్టపడడం లేదు.

అయినా కూడా 2014, 2019 ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసినవాళ్లు సైతం పట్టుమని పదివేల ఓట్లు సాధించలేకపోయారు. ఆశ్చర్యంగా మాకు ఈ నాయకుల్లో ఎవరూ వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు పెట్టిన నోటా కన్నా కూడా తక్కువ సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అవసాన దశలో ఉందన్న విషయాన్నీ ఎలుగెత్తి చాటుకుంది. కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి . ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి.

ఇక్కడ నోటాకు 2340 ఓట్లు రావడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు. ఇకముందూ దక్కదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చినా కూడా ఆంధ్రలో కాంగ్రెస్ కి అస్తిత్వం లేదు, ఇప్పుడు ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది ఇక్కడి స్కూలు పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు. ఇక మొత్తంగా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తోంది. కొందరు అయితే ఆ పార్టీ చరిత్ర ముగిసిపోయింది అన్నట్టుగా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -