Alcohol: బీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు దాని జోలికి పోవద్దు!

Alcohol: ప్రస్తుత కాలంలో రోజుకొక పుట్టుకొస్తున్న కొత్త కొత్త వ్యాధులతో ప్రజలు అవస్థలు ఎదుర్కుంటున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని రకాల వ్యాధులు సోకుతుండటంతో ఆరోగ్యాలను కపాడుకునేందుకు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరికైన షుగర్‌ బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆల్కహాల్‌ తీసుకోవచ్చా.. లేదా అదే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే షుగర్‌ ఉన్న వాళ్లు అదిక మోతాడులో ఆల్కహాల్‌ తీసుకోరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీపీ, డయాబెటీస్‌తో బాధ పడుతున్నవారైతే మరింత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మోడరేట్‌గా తీసుకునే ఆల్కహాల్‌ కూడా ముందుగానే ఉన్న కండిషన్స్‌ని ఇంకా తీవ్రంగా చేస్తోందంటున్నారు. ఆల్రెడీ టైప్‌ 2 డయాబెటీస్‌ ఉన్న వారు వారానికి 8 లేదా అంత కన్నా ఎక్కువ గ్లాసుల ఆల్కహాల్‌ తీసుకుంటే వారికి హైబీపీ వచ్చే ప్రమాదం ఉంటుంది. మోడరేట్‌గా ఆల్కహాల్‌ తీçసుకుంటున్న కూడా ఈ రిస్క్‌ ఉంటుందా అనే అంశంపై చేసిన పరిశోధనాల్లో వారానికి 8 గ్లాసుల కన్నా ఎక్కువ ఆల్కహల్‌ తీసుకునే వారికి హైబీపీ, బ్లడ్‌ షుగర్, కార్డియో వాస్క్యులర్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ అరవై శాతం పెరుగుతోందని గుర్తించారు. అయితే, ఆల్కహాల్‌ ఆరోగ్యానికి మంచిది కాదనీ, రోజుకి ఒక డ్రింక్‌ కన్నా ఎక్కువ తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుతాయని హెచ్చరిస్తున్నారు.

తలెత్తే సమస్యలు ఇవే..

1. ఎక్కువ కాలం ఆల్కహాల్‌ తీసుకోవడంతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది.

2. ఆల్కహాల్‌ ఎక్కువ కన్‌స్యూం చేసేవారు వారి ప్రవర్తన మీద అధికారాన్ని కోల్పోతారు. డెసిషన్‌ మేకింగ్‌ పవర్‌ పోతుంది. ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు.

3. మెదడు జ్ఞాపకాలను స్టోర్‌ చేసుకునే ప్రాసెస్‌ తో ఆల్కహాల్‌ ఇంటర్ఫియర్‌ కావడంతో తాగినప్పుడు ఏం చేశారో గుర్తుండదు.

4. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకుంటే బ్రెయిన్‌ కు సంబం«ధించిన ఫ్రంటల్‌ లోబ్స్‌ ష్రింక్‌ అవుతాయి.

5. మీ పని, చదువు, బంధాలు ఆల్కహాల్‌ కారణంగా ప్రభావం చూపితే మీరు ఆల్కహాల్‌ మీద డిపెండ్‌ అయినట్టే.

6. నిత్యం అదిక మోతాదులో ఆల్కహాల్‌ తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ చాలా ఎక్కువ.

7. లివర్‌ ని డ్యామేజ్‌ చేసి లివర్‌ ఫంక్షన్‌ ని దెబ్బతీస్తుంది.

8. టీబీ, న్యుమోనియా వంటి వ్యాధులు ఈజీగా దాడి చేస్తాయి.

9. గొంతు, నోరు, ఈసోఫేగస్‌ కాన్సర్లూ, స్త్రీలైతే బ్రెస్ట్‌ కాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -