Alcohol: ఖాళీ కడుపుతో ఆల్కహాల్‌ తాగితే ఆ ముప్పు వెంటాడుతోంది!

Alcohol: చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత నిద్రపోవడం వల్ల రాత్రంతా మన శరీరం ఆ ఆహారం నుంచి వచ్చే శక్తిని వినియోగించుకుంటుంది. ఈ క్రమంలో మార్నింగ్‌ నిద్ర లేవగానే ఎనర్జీ లెవెల్స్‌ తగ్గిపోయి ఆకలిగా అనిపిస్తుంది. మరి కొందరికి మాత్రం బ్రష్‌ చేసుకోగానే ఆకలిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది నోట్లో వేసుకుని ఆడించేస్తుంటారు. ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, ఫ్రిజ్‌ లో ఉండే ఆహారాన్ని లాగించేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఏ మాత్రం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే రాత్రి భోజనం చేసిన తర్వాత మన శరీరం ఆ శక్తిని ఉపయోగించుకుని విధులు నిర్వర్తిస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే పొట్ట ఖాళీ అవుతుంది. దీంతో గ్యాస్‌ ఉత్పత్తవుతుంది. ఈ కారణం ఎసిడిటీకి దారి తీస్తుంది. దీంతో పాటు మసాలా, ఘాటు ఉండే పదార్థాలను పరిగడుపున తీసుకుంటే ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటున్నందున కొన్ని రకాల ఆహారాలను తీసుకోకుండా జాగ్రత్తపడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలా తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయంట. ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉండటంతో మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతాయి. ఉదయాన్నే మసాలా లేదా ఫ్రై డ్‌ ఫుడ్స్‌ తినకుండా చూసుకోవాలి. పరిగడుపునే వీటిని తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు వస్తాయి. అలాగే కడుపు, ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అంతే కాకుండా పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలా మందికి బ్రష్‌ చేసుకోగానే కాఫీ లేదా టీ సిప్‌ చేయాలనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగడం వల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు వస్తాయి. దీనికి బదులుగా గోరువెచ్చటి నీరు తాగడం మంచిది. పరిగడుపున ఆల్కహాల్‌ తీసుకోవడం ప్రమాదకరమైంది. ఇది కాలేయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. రక్తంలో ఆల్కహాల్‌ వేగంగా వ్యాపించి రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -