Wine Brands : మద్యం ప్రియులకు తెలియని మద్యం రకాలు ఇవే!

Wine Brands : ఒకొక్కరు ఒక్కో రకమైన బ్రాండ్‌ మద్యం తాగుతుంటారు. రమ్, వోడ్కా, వైన్, విస్కీ మధ్య ్య తేడా ఎలా ఉంటుందో మద్యం ప్రియులకు బాగా తెలుసు. అయినా చాలా మందికి వాటి దాని గురించి తక్కువ జ్ఞానం ఉంటుంది. ఒక్క చుక్క మందు తాగాని వారికి కూడా ఏ ఏ రకాల మందులు ఉంటాయే అని తెలుసుకోవాలని ఉంటుంది. నిత్యం మద్యం తాగేవారికి కూడా ఆయా బ్రాండ్ల మద్య ఉండే తేడా తెలిదు. ఎందుకంటే రమ్, వోడ్కా, వైన్, విస్కీ అన్ని వేరు వేరు అయినా.. ఇందులో ఉండే తేడాను పూర్తిస్థాయిలో గుర్తించలేరు. ఎలాంటి మద్యం అయినా ఆరోగ్యానికి హానికరమే అన్నది మాత్రం అందరికీ తెలిసిందే. రమ్, వోడ్కా, వైన్, విస్కీల మధ్య వ్యత్యాసం వాటి తయారీ వాటిలో ఉండే ఆల్కహాల్‌ పరిమాణంలోనూ తేడా ఉంటుంది. ఇదేకాకా రుచి, రంగు కూడా భిన్నంగా ఉంటాయి.

విస్కీ: గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల నుంచి తయారైన విస్కీలో 30 నుంచి 65 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. సాధారణంగా, ఇందులో ఆల్కహాల్‌ కంటెంట్‌ దాదాపు 40 శాతం ఉంటుంది. కెనడా, భారత్, జపాన్‌ లాంటి దేశాల్లో విస్కీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారు. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు మనం పాటించే పద్ధతినే పాటిస్తాయి. విస్కీలో స్కాచ్, బర్బన్, జపనీస్, ఐరిస్, టెన్నీస్, కెనడియన్, రై విస్కీ అంటూ చాలా రకాలు ఉంటాయి. ఎంత ఎక్కువ ధర ఉంటే అంత ఎక్కువ క్వాలిటీ ఉన్నట్లు మద్యం ప్రియులు అంటుంటారు. తక్కువ ధరతో లబించే విస్కీని కాక్‌ టెయిల్స్‌ తయారీకి వాడడం మంచి పద్ధతి. ఎక్కువ ధర ఉన్నవాటిలో కొద్దిగా నీళ్లు కలుపుకొని అలాగే సిప్‌ చేయడానికి ఉపయోగించడం వల్ల మంచి కిక్‌ వస్తోందట.

వోడ్కా: 40 నుంచి 60 శాతం ఆల్కహాల్‌ ఉన్న వోడ్కా మంచి నీటిలా కనిపిస్తుంది. కానీ దాని ప్రభావం చాలా వేగంగా ఉంటుంది.పోలాండ్, రష్యా దేశాలలో దీనిని మొదటగా తయారు చేశారు. సాంప్రదాయికంగా వోడ్కా తయారీలో పులియబెట్టిన తృణ ధాన్యాలను, బంగాళాదుంపలను వినియోగిస్తారు. అయితే ఆధునిక పద్ధతులలో తయారు చేయబడే వోడ్కాలో ఫలాలు కూడా వినియోగిస్తున్నారు. చాలా శతాబ్దాల నుంచి వాడుకలో ఉన్న వోడ్కా వంటి పానీయాలకు నేటి వోడ్కాకు చాలా తేడా ఉంది. ప్రాచీన కాలంలో ఆల్కహాల్‌ స్పిరిట్‌ వేరే రుచి, రంగు, వాసన కలిగి ఉండేది. దీనిని ఒక ఔషధంగా ఉపయోగించారు. ఇందులో తక్కువ ఆల్కహాల్‌ అంటే గరిష్టంగా 14 శాతం ఉండేది. ప్రస్తుం అలా ఉండటం లేదు మారిపోయింది.

రమ్‌: చలికాలంలో తక్కువ డబ్బుతో అధిక ఆల్కహాల్‌ శాతం ఉన్న రమ్‌ను తాగుతుంతటారు. ఇందులో 40 శాతానికి పైగా ఆల్కహాల్‌ ఉంటుంది. ఇది చెరుకు రసాన్ని పులియబెట్టి తయారు చేస్తారు. అందుకే ఇది చాలా స్పెషల్‌. ఇతర మద్యం రకాలేవీ చెరకుతో తయారు చేయరు. చెరకును ఉడకబెట్టి, స్కిమ్మింగ్‌ చేసే, అందులో మిగిలిన మొలాసిస్, అవక్షేపాలతో రమ్‌ను తయారు చేస్తారు. రమ్‌ తాగితే కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవి మితంగా తాగినప్పుడే శరీరానికి అందుతాయి. అధికంగా తాగితే మాత్రం వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

వైన్‌: వైన్‌ చాలా తక్కువ ఆల్కహాల్, అద్భుతమైన రుచికి కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రజలు కూడా ఎక్కువగా తాగుతారు. సమతుల్య పరిమాణంలో వైన్‌ తాగడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట. ఇందులో 9– 18 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. దీని తయారీకి ద్రాక్ష వంటి పండ్లను ఉపయోగిస్తారు. ద్రాక్షను సేకరించిన తర్వాత, దానిని పులియబెట్టడం కోసం పైనరీకి తరలిస్తారు. ఈ దశలో వైట్‌ వైన్‌ తయారీ, రెడ్‌ వైన్ల తయారీ వేర్వేరు పద్ధతిలో జరుగుతుంది. రెడ్‌ వైన్‌ అనేది ఎర్ర లేదా నల్ల ద్రాశను తొక్కతో సహా పులియబెట్టిన సమయంలో ఆ పండ్లలోని గుజ్జు నుంచి తయారవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -