Andhra Pradesh: అభివృద్ధి లేదు సంక్షేమం లేదు.. అంతా డొల్లే.. ఏపీలో వాస్తవ పరిస్థితులు ఇవేనా?

Andhra Pradesh: ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడేకొద్ది సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభలు దద్దరిల్లిపోతున్నాయి. అయితే, ఇటీవల చంద్రబాబు.. సీఎం జగన్‌కు చేసిన సవాల్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫ్యాన్ రెక్కలు విరిచి మూలన పడేసే టైం దగ్గరపడిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఊకదంపుడు ప్రసంగాలు, ప్రజలను మభ్యపెట్టే హామీలు, సినిమా డైలాగులు కాకుండా ఏపీలో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపైనా, విధ్వంసం, దాడులపైన చర్చకు రావాలని జగన్ కు సవాల్ చేశారు. ప్లేస్, టైం చెబితే ఎక్కడికైనా వచ్చి ఏం అంశంపై అయినా చర్చించడానికి సిద్దంగా ఉన్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. నిజానికి అభివృద్ధి, సంక్షేమం.. ప్రభుత్వ పాలన తీరుపై ఆరోగ్యకరమైన చర్చ జరగడం మంచిదే. నిజానికి జగన్ ఈ సవాల్ ను స్వీకరించి చర్చకు వెళ్తే.. అది కూడా ఆరోగ్యకరంగా జరిగితే.. దేశ చరిత్రలోనే ఓ కీలక ఘట్టంగా ఉండేంది.

కానీ, దాన్నికూడా వైసీపీ నేతలు రాజకీయం చేసేశారు. జగన్ మహానుబావుడని.. ఆయనతో చర్చకు కూర్చొనే స్థాయి చంద్రబాబుకు లేదని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీకి ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రెస్‌మీట్ పెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు సవాల్ పై స్పందించారు. జగన్ స్థాయి చంద్రబాబుకు లేదని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 99శాతం హామీలను తమ ప్రభుత్వ నెరవేర్చిందని చెప్పారు. ఎక్కడో ఒకటో అరో మిగిలిపోతే.. ఎందుకు చేయలేకపోయానో జగన్ ధైర్యంగా చెప్పారని అన్నారు. అయితే.. ఇక్కడ సజ్జల వాదన ఎలా ఉందంటే.. అమలు చేయలేకపోయామని చెబితే.. అమలు చేసినట్టేనని ఫీల్ అవుతున్నట్టు ఉంది. సజ్జల చెప్పినట్టు ఒకటో అరో అమలుకాకపోతే తప్పు లేదు. కానీ, గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదని టీడీపీ నేతలు చెబున్నారు. గత ఎన్నికల్లో జగన్ 650 హామీలు ఇచ్చారని.. అందులో, 10 శాతం కూడా అమలు చేయలదని విమర్శిస్తున్నారు. చెప్పుకోవడానికి నవరాత్నాలు తప్పా ఇంకేమీ లేవని మండిపడుతున్నారు.

అంతేకాదు.. ఆ నవరత్నాలు కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని.. కారు ఉందని కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. ఐదేళ్ల నుంచి వారెందుకు ఆందోళన చేస్తారో సజ్జల చెప్పాలి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు జీతాల పెంపు కోసం ధర్నాలు చేస్తున్నారు. వారికి న్యాయం జరిగితే ధర్నాలు చేస్తారా? మెగా డీఎస్సీ అని చెప్పి ఐదేళ్లు అవుతుంది. ఇప్పటికీ దానిపై ఉలుకు లేదు పలుకూలేదు. ఇప్పుడు డీఎస్పీ పేరుతో హడావుడి చేస్తున్నారు తప్పా.. దానికి న్యాయపరమైన చిక్కులు వదలడం లేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు మరోసారి వైసీపీని గెలిపించడానికి సిద్దమా అని అడుగుతున్నారు. ఇలా చాలా హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. అంతెందుకు.. విభజన హామీల విషయంలో ఎంతవరకు చిత్తశుద్ది చూపించారు? ప్రత్యేకహోదా పేరుతోనే జనంలోకి వెళ్లారు. గెలిచిన తర్వాత దాన్ని మరిచారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. కనీసం అతీగతీ లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రైల్వే జోన్ ఏమైందో కూడా తెలియదు. ఇవన్నీ జగన్ ఇచ్చిన హామీలే కదా? ఇవన్ని అమలు కాకుండా మిగిలిపోయినవే కదా? మరి వీటికి ఏమని సమాధానం చెబుతారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సవాల్ ను అంగీకరించలేక తప్పించుకోవడానికి వైసీపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -