Viveka: వివేకా హత్య కేసులో వాళ్లపై అనుమానాలు.. ఏం జరిగిందంటే?

Viveka: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్న కూడా ఒకటే పేరే వినిపిస్తోంది అదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. ప్రస్తుతం ఏపీలో ఈ వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తరచూ ఈ విషయంలో ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 2019లో మార్చి 15న వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ కేసులో భాగంగా ఇప్పటికే చాలామంది పేర్లు వినిపించగా ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కీలకంగా మారిన విషయ తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడిగా మారాయి.

ఇది ఇలా ఉండే తాజాగా ఈ కేసులో మరో ఊహించిన వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన రెండవ భార్య షేక్ షమీన్ ఉన్నట్టుండి తెరపైకి వచ్చింది. దాంతో వివేకా హత్య కేసు కాస్త ఆమెపైకి మళ్ళింది. దీంతో వివేకా హత్య కేసుకి ఆమెకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయా నా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా వివేకా హత్య కేసులో ఏది నిజం? రెండో భార్యతో వివేకాకు ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఆ ఆస్తి తగదాలే వివేకా హత్యకు కారణమా? అంటే ఆస్తి తగాదాలు ఉన్న సంగతి నిజమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 

అలాగే వివేకా రెండవ భార్యతో వివేక కుమార్తె సునీత ఆమె భర్త తరచూ గొడవలకు దిగారు అన్నది కూడా వాస్తవమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు చివరిసారిగా చూడడానికి కూడా రెండవ భార్య రాకపోవడంతో సునీత ఆమె భర్త బెదిరింపుల కారణంగానే ఆమె చివరిసారిగా చూడడానికి కూడా రాలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరు కీలకంగా వినిపించగా తాజాగా అతని రెండో భార్య పేరు కూడా ఇందులో ప్రధానంగా వినిపిస్తోంది. మరి వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరు? ఈ కేసులు ఇంకా ఎన్ని మలుపులు తిరగనుంది. ఈ కేసు ఇప్పట్లో ముగుస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -