Munugode Bypolls: మునుగోడులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. TRSకు ఆ పార్టీ మద్దతు

Munugode Bypolls: మునుగోడు ఉపఎన్నిక వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీల వ్యూహలు, ప్రతివ్యూహలు పాలిటిక్స్ కాక పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఈ ఉపఎన్నికలన కీలకంగా తీసుకోవడంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. మునుగోడు యుద్దంలో ఏ పార్టీ గెలుస్తుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తుండగా.. రాజగోపాల్ రెడ్డికి నల్లగొండ జిల్లాలో మంచి పేరు ఉంది. దీంతో బీజేపీకి కూడా అక్కడ గట్టిగా పోటీ ఇవ్వనుంది. ఈ ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠకరంగా మారింది.

అయితే మునుగోడులో లెఫ్ట్ పార్టీల ఓటర్లు కీలకంగా మారారు. ఆ నియోజకవర్గంలో వామపక్ష పార్టీల ఓటర్లు ఎక్కువమంది ఉన్నారు. దీంతో కామ్రెడ్స్ ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మారారు. గతంలో ఆరుసార్లు మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ గెలుపొందింది. దీంతో లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం పార్టీలన్నీ ముమ్మరంగా చర్చలు జరుపుతున్నాయి. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. ఇటీవల టీ కాంగ్రెస్ నేతలు వామపక్ష నేతలతో సమావేశమయ్యారు. మునుగోడులో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. తాము పార్టీలో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని టీ కాంగ్రెస్ నేతలకు వామపక్ష నేతలు చెప్పారు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రగతిభవన్ లో వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో కేసీఆర్ అడగటంతో టీఆర్ఎస్ కు మునుగోడులో మద్దతు ఇచ్చే విషయంలో వామపక్ష నేతలు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ కు వామపక్ష పార్టీలు మద్దతు తెలపడం ఖాయమని చెప్పవచ్చు. ఇవాళ వామపక్ష పార్టీలన్నీ సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనన్నాయి.

నేడో, రేపే టీఆర్ఎస్ కు మద్దతు విషయంపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ఇస్తామని గత కొద్దిరోజులుగా వామపక్ష నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న టీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎం మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో మునుగోడులో కాంగ్రెస్ కు షాక్ తగిలినట్లు అయింది. తమకు మద్దతు ఇస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశించారు. ఇప్పుడు కామ్రేడ్స్ కేసీఆర్ వైపు మళ్లడంతో టీ కాంగ్రెస్ నేతల ఆశలు అడియాశలయ్యాయి.

ఇక ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జనసమితి పార్టీ మద్దతును కాంగ్రెస్ కోరింది. ఇటీవల కోదండరాంను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మునుగోడులో తమ పార్టీని మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలకు కోదండరాం తెలిపారు. అయితే కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కోదండరాం.. మునుగోడులో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశముంది. ఇది జరిగితే కాంగ్రెస్ కు కాస్త ఊరట లభిస్తుంది. కానీ తెలంగాణ జనసమితి మునుగోడులో బలంగా లేదు. క్యాడర్ కూడా అంతగా లేదు. దీంతో టీజేఎస్ మద్దతు వల్ల కాంగ్రెస్ కు ఒరిగేదీ ఏమీ లేదని చెప్పవచ్చు.

మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. నల్లొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట అని అందరూ చెబుతారు. అలాంటి చోట్ల కాంగ్రెస్ కు సొంత బలం బాగానే ఉంది. టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్ కు బాగానే ఉంది. మరి టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఢీకొడుతుందా? లేదా? అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -