Tarak: తారక్33 మూవీకి దర్శకునిగా క్రియేటివ్ జీనియస్.. ఏం జరిగిందంటే?

Tarak: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ విషయానికి వస్తే పుష్ప పార్ట్ వన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 2ను తెరకెక్కిస్తూ బిజీబిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమాకు సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. అయితే పుష్ప సినిమా తర్వాత సుకుమార్ ఎటువంటి సినిమా చేయబోతున్నాడు అన్న విషయంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారని అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత రామ్ చరణ్ పేరు వినిపించింది.

మోస్ట్ రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే గత ఐదేళ్లలో కేవలం ఆర్ఆర్ఆర్ సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో జోష్ ని పెంచేశారు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే వార్-2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న ఎన్టీఆర్ 31సినిమాతో బిజీ కానున్నారు. ఏడాదిన్నర లోపు ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ లో ఉన్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు. పుష్ప-2 సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పై పూర్తి దృష్టి పెట్టనున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -