Om Raut: చీకటిగా లంక.. రామాయణం గురించి ఓం రౌత్ కు అవగాహన లేదా?

Om Raut: టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యింది. సినిమా విడుదల అయితే అయ్యింది కానీ భారీగా నెగిటివ్ సొంతం చేసుకోవడంతో విమర్శల పాలు అయింది. హీరో ప్రభాస్ వరకు అభిమానులు బాగానే ఉన్న దర్శకుడి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు రామాయణం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్లకు కూడా ఇది నిజంగా రామాయణమేనా అన్న అనుమానం కలగక మానదు. అలా వరకు సినిమాలలో రామాయణంలో ఉన్న సన్నివేశాలను పూర్తిగా మార్చేశారు డైరెక్టర్.

అలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా నెగటివ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రావణాసురుడి విషయంలో అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఏడాది టీజర్ రిలీజ్ అయినప్పుడే రావణ్ పాత్రపై చాలా విమర్శలు చెలరేగాయి. అతడి గెటప్, మరో కమ్యూనిటీని గుర్తుచేసేలా ఉందని విమర్శించారు చాలామంది. ఇక అతడి గెటప్ కూడా శివభక్తుడిలా కనిపించలేదన్నారు. వీటిలో కొన్నింటిని సినిమాలో కవర్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ లో రావణ్ కు, సినిమాలో రావణ్ కు గ్రాఫిక్స్ పరంగా చిన్న తేడాలు కనిపించాయి. అయితే రావణుడి వాహనం విషయంలో మాత్రం ఈ మార్పు జరగలేదు.

 

టీజర్ లో రావణుడికి ఒక వింత వాహనం ఇచ్చారు. అప్పట్లో దానిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత గ్రాఫిక్స్ మార్చడం కోసం గ్యాప్ తీసుకున్న యూనిట్. ఈ అంశాన్ని కూడా సరిదిద్దుతుందని భావించారు. కానీ ఆదిపురుష్ సినిమాలో రావణుడి వాహనాన్ని మార్చలేదు. రావణుడికి వాహనంగా ఒక గబ్బిలాన్ని పెట్టారు. ఈ విషయంలో మాయచేసే ప్రయత్నం కూడా చేయలేదు. అచ్చంగా గబ్బిలం యానిమేషన్ నే చూపించారు. రావణ్ వాహనం గబ్బిలమనే విషయం ఏ రామాయణంలో ఉందో ఓం రౌత్ కే తెలియాలి. ఒక దశలో కుబేరుడిపై యుద్ధం చేసి, అతడి పుష్పక విమానాన్ని లాక్కొని, ఆ రెక్కల రథాన్ని కొన్నాళ్లు రావణుడు ఉపయోగించాడని పురాణాల్లో ఉంది.

కనీసం ఇలా చూపించినా సరిపోయేది. కానీ ఎటు కాకుండా రావణాసురుడు వాహనంగా గబ్బిలం పెట్టడంతో అభిమానులు మండిపడుతున్నారు. రావణుడికి చెందిన లంకను చూపించే విధానం కూడా బాగాలేదు. రావణుడి రెండో ప్రాణం లంక. దేవ శిల్పి విశ్వకర్మ నిర్మాణం అది. కుబేరుడి అలకాపురి, ఇంద్రుడి అమరావతిని సైతం తలదన్నే నిర్మాణం అది. ఆకాశంలో కట్టినట్టుండే నగరం అది. ప్రతి ఇంట్లో వేదాలు, శివనామ స్మరణలు వినిపించే నగరం అది. రాత్రిపగలు తేడా లేకుండా వజ్రవైఢూర్య కాంతులతో ధగధగలాడే నగరంగా పురాణాల్లో లంకకు ప్రాముఖ్యత ఉంది. అలాంటి మేలి నగరాన్ని నల్లగా చూపించారు. లంక మొత్తం చీకటిగా కనిపిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -